సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలోని డ్రమ్స్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి. ఇది గమనించి స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనల స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది ఫైర్‌ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగనట్లు…
కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద ఇలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణలో కమలా సొసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోందన్న…
నల్గొండ జిల్లాలో నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ కేటీఆర్.. ప్లీనరీలో కేసీఆర్ మాటలు చూస్తుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారెమో..? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్లీనరీలో కేసీఆఆర్.. ఎన్టీఆర్‌ని స్మరించారన్నారు. కేసీఆర్ తెలంగాణలో పోత్తుల గురించి ఆలోచిస్తున్నారు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నీ ముచ్చింతలకి ఎస్‌పీజీ వాళ్ళు రావద్దు అని చెప్పారు అని ఎప్పుడో చెప్పిన.. మీరే వినలేదు.. కేటీఆర్ మీడియా ముందే…
నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేదు.. చాలా దుర్భర పరిస్థితి లు ఉండే.. అల్లా, భగవంతుని దయ వల్ల మీ సహకారం వల్ల అధిగమించామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని, దేశ వ్యాప్తంగా మైనారిటీ గురుకుల…
కేంద్రమంత్రి నితన్ గడ్కరీ నేడు తెలంగాణలో పలు నేషనల్ హైవే పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం హైవేను 4లేన్ల రహదారిగా విస్తరించాలని ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కలిసి వినతి పత్రం అందజేశారు. తన చేవెళ్ల పార్లమెంట్…
తెలంగాణ రాష్ట్రంలో 10 NH ప్రాజెక్ట్‌లు, 7 CRF పనుల భూమిపూజ, 2 NH ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు వచ్చిన గడ్కరీకి సీఎం కేసీఆర్ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 2014 నుండి 2525 కిలోమీటర్ల పొడవును జోడించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో NH నెట్‌వర్క్‌ను మెరుగుపరచినందుకు, వార్షిక ప్రణాళిక 2021-22లో 613 కి.మీ పొడవుతో 6211 కోట్ల విలువైన 15 NH ప్రాజెక్ట్‌లను మంజూరు చేసినందుకు…
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా పరిస్థితులు మారాయి భారతదేశానికి ధాన్యం అందించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఆయన అన్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగిందన్నారు. రైతుల రుణమాఫీ చేయని…
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు….జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాట్టు చేసిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తన విజ్జప్తిపై వెంటనే ముఖ్యంమంత్రి స్పందించి జీవో ఇచ్చారు…
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీది ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. 96 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్థానికంగా సఖ్యత లేని కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ వచ్చి ఏంచేస్తాడని ఆయన ప్రశ్నించారు…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మేము మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు మీరు.. అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లికల్లు లిఫ్ట్…