రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో జంట మృతదేహాలు కలకలం సృష్టించాయి. అయితే.. రెండు మృతదేహాలు వారసిగూడ చెందిన యువకుడు యశ్వంత్ మహిళ జ్యోతి గా పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌గా యశ్వంత్ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం ఫోన్ కాల్ రావడంతో యశ్వంత్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మృతిచెందిన జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో 3 ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు.
ఘటన స్థలానికి యశ్వంత్ కుటుంబీకులు వచ్చినప్పటికీ జ్యోతి కుటుంబానికి సమాచారం ఇచ్చిన ఘటన స్థలానికి రాకపోవడంతో భర్త శ్రీనివాస్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త శ్రీనివాస్ విజయవాడలో ఉన్నట్లు సమాచారంతో విజయవాడకు ప్రత్యేక పోలీసులు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే హత్యకి కారణం అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.