తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్-1 ఉద్యోగల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలసిందే. అయితే తాజాగా.. గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ www.tspsc.gov.inని సందర్శించి, సూచించిన ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అంతేకాకుండా దరఖాస్తు ఫారమ్‌లో భాగంగా ఓటీఆర్ (OTR) నుండి డేటా తీసుకోబడుతుంది కాబట్టి, ఇంకా తమ ఓటీఆర్‌ను సవరించని అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఎడిట్ చేసుకోవాలని, అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ లోని తమ సమాచారం అప్‌డేట్ చేయబడిందని, ఖచ్చితమైనదని నిర్ధారించుకోవాలని తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారమ్, యూజర్ గైడ్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండవద్దని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.