Shankar : శంకర్ దర్శకత్వంలో ధనుష్.. జరిగేపనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు శంకర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. గేమ్ చెంజర్ దెబ్బకు శంకర్ తో సినిమా అనే భయపడుతున్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్నశంకర్ తన కలల ప్రాజెక్ట్ అయిన ‘వేల్పారి’ చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ నవల ‘వీర యుగ నాయగన్ వేల్పారి’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం వెర్సటైల్ యాక్టర్ ధనుష్‌ను శంకర్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రణవీర్ సింగ్, చియాన్ విక్రమ్ వంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా, ఇప్పుడు ధనుష్ పేరు తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతోజ్ బిజీ బిజిగా ఉన్నారు. 2026-27 వరకు ధనుష్ డైరీ పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్, ‘డి55’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీగా ఉన్నారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేయాలని ఎవరికైనా ఉన్నప్పటికీ, తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ధనుష్ ఈ భారీ ప్రాజెక్టుకు సమయం కేటాయించగలరా? లేదా? అనేది ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా ధనుష్ కొత్త సినిమా ‘డి55’ ప్రారంభోత్సవానికి శంకర్ హాజరుకావడంతో, వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ధనుష్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రంగా నిలవడం ఖాయం.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!