జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో…
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. అయితే.. ఇప్పటికే సైబరాబాద్ మాజీ సీపీ సజ్జనార్ కోర్టుకు హజరయ్యారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కమిషన్ రిపోర్టు అందిందని తెలిపింది. ది శ కేసు తిరిగి తెలంగాణ హైకోర్టుకే పంపే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిర్పూర్‌కర్ కమిటీ నివేదిక బయటపెట్టాలని నిందితుల తరుఫు న్యాయవాది కోరారు. నివేదిక బహిర్గతమైతే సమాజంపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ తరుఫు…
పెగసస్ స్పై వేర్ అంశంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పెగసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే.. మాల్‌వేర్ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్ కమిటీ తెలిపిందని, టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసిందని సీజేఐ వెల్లడించారు. తుది నివేదికను సమర్పించేందుకు టెక్నికల్ కమిటీ సమయం కోరడంతో సీజేఐ అంగీకరించారు. ఈ నేపథ్యంలో.. మొబైల్…
సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటు మహిళ ఫిర్యాదు మేరకు ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సమయంలో.. సోదాలు అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డిను అక్రమంగా జీఎస్టీ అధికారులు నిర్బంధించిన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భదించిన అధికారుల పై…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే.. వైద్యురాలనికి నలుగురు నిందితులు శంషాబాద్‌లోని చటాన్‌పల్లిలో వద్ద గల అండర్ పాస్ బ్రిడ్జి వద్ద అత్యాచారం చేసి హత్య చేశారు. దీంతో పోలీసులు నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నారు. అయితే.. 2019 డిసెంబరు 6న సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించిన సమయంలో.. పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారు. ఈ…
గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్‌పీఎస్సీకి అందించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ విడుదలపై బీఆరే భవన్‌లో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం…
కరోనా మహహ్మరి మానవాళిని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న కరోనా నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రజలు సతమతమయ్యారు. దీంతో థర్డ్ వేవ్ ప్రారంభం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టం చేయడంతో.. థర్డ్‌వేవ్‌ను ఆదిలోనే అంతం చేయగలిగాం. అయితే.. ఇటీవల కరోనా పుట్టినిల్లు చైనాలో.. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ కేసులు భారీ నమోదవతుండటంతో అక్కడి లాక్‌డౌన్ విధించారు. ఇప్పడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలపై సడలింపు ఇచ్చారు.…
యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు జిల్లాలోని దవాఖానల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు బీబీనగర్‌లోని ఎయిమ్స్ దవాఖానను మంత్రి హరీష్ రావు సందర్శిస్తారు. 11.40 గంటలకు భువనగిరి పట్టణంలోని జిల్లా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌లో ఆధునీకరించిన పీడియాట్రిక్ కేర్ యూనిట్ (DPCU)ను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. అనంతరం…
వానాకాలం పంట సీజన్‌కు సంబంధించిన సన్నద్ధత పనుల్లో తాము నిమగ్నమైన ఉన్నందున, కృష్ణా బేసిన్లో రిజర్వాయర్ల నిర్వహణపై చర్చించడానికి ఏర్పాటైన కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. వివిధ అంశాలపై చర్చించేందుకు నిర్ణీత గడువులు పెట్టుకున్నందున ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20నే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేడు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ తొలి సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్, రూల్ కర్వ్, మిగులు…
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు నేడు పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ నందమూరి స్టార్ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. యంగ్ టైగర్‌ను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.…