దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. అయితే.. ఇప్పటికే సైబరాబాద్ మాజీ సీపీ సజ్జనార్ కోర్టుకు హజరయ్యారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కమిషన్ రిపోర్టు అందిందని తెలిపింది. ది శ కేసు తిరిగి తెలంగాణ హైకోర్టుకే పంపే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిర్పూర్‌కర్ కమిటీ నివేదిక బయటపెట్టాలని నిందితుల తరుఫు న్యాయవాది కోరారు. నివేదిక బహిర్గతమైతే సమాజంపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ తరుఫు న్యాయవాది వివరించారు. దీంతో.. రిపోర్టును బహిర్గతం చేయలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది.
2019 డిసెంబరు 6న సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించిన సమయంలో.. పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు. దీంతో… పోలీసులు ఫేక్ ఎన్‌కౌంటర్ చేశారంటూ.. నిందితుల కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘం నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. సుప్రీం కోర్టు జస్టిస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో.. హై కమిషన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో 3 సంవత్సరాల పాటు దిశ ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పూర్‌కర్, రేఖ ప్రకాశ్, కార్తికేయన్ సభ్యులతో త్రిసభ్య కమిషన కమిషన్ విచారణపూర్తి చేసింది. ఇటీవలే నివేదికను సుప్రీంకోర్టుకు సిర్పూర్‌కర్ కమిషన్ సమర్పించింది.