వారణాసి లోని కాశీ విశ్వనాధ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం ముగిశాయి. వారణాసి జిల్లా కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. అనుభవజ్ఞులైన న్యాయమూర్తి దీనిని విచారించాలని ఆదేశించింది. సివిల్ వివాదంలోని అత్యంత సున్నితమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, కేసును సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. సీసీపీ నిబంధన 11లోని 7…
ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిందా తిలిస్మాత్‌గా రైతు బంధు మారిందని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి 500 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారని, రియల్ వ్యాపారులకు ప్లాట్లు చేసి అమ్మిన పట్టాదారు పాస్ బుక్ ఉందని…
ఉరుకుల పరుగుల భాగ్యనగరానికి రోజూ జిల్లాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. అందులో కొందరు ఇప్పటి వరకు హైదరాబాద్ గురించి తెలియని వారుకూడా ఉంటారు. అయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడకు వెళ్లాలో తెలియక ఎంతో మంది తికమక పడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు వేరే బస్సులు ఎక్కి అవస్థలు పడ్డ సందర్భాలు కూడా మనం చూసే ఉంటాం. అయితే ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలకం…
హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో నిన్న చోటు చేసుకున్న పరువు హత్యను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నీర్‌జ్ అనే యువకుడు సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన సంజన సోదరులు, తమ స్నేహితులతో కలిసి నీరజ్‌పై దాడి చేసి హతమార్చారు. అయితే.. ఎన్టీవీతో సంజన తల్లి మాట్లాడుతూ.. నా కూతురు సంసారాన్ని నాశనం చేశారని, హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీరజ్ హత్యలో మా కుటుంబ…
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకు శ్రీలంకలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. అయితే.. ఇటీవల పెట్రోల్, డీజిల్ నిలువలు కూడా లేకపోవడంతో శ్రీలంకలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారు. కోలంబోలో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్రోలు బంక్ వద్ద లంకా వాసుల ఘర్షణలకు దిగుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం ఒకరిని ఒకరు క్యాన్ లతో లంకా వాసులు కొట్టుకున్నారు. మరో మూడు రోజులు పెట్రోలు, డీజిల్ దేశంలో ఉండదని లంక ప్రభుత్వం ప్రకటించింది.…
ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు చేస్తూనే ఉంది. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌లోని మహిళలపై రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు ఉక్రెయిన్ యువతిలు, మహిళలు మమ్మల్ని రష్యా సైనికులు అత్యాచారం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. శుక్రవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడిగా కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఉక్రెయిన్ చెందిన మహిళ ఒక్కసారిగా రెడ్ కార్పెట్‌పైకి తన…
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇప్పటికే పలు శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నియామక మండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.…
సుప్రీంకోర్టు శుక్రవారం దిశ ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ చేపట్టింది. సిర్పూర్‌కర్ హైపవర్ కమిషన్ నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కూడా హాజరయ్యారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ ఎన్‌కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని కోర్టు తేల్చిన సుప్రీం.. ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని…
హైదరాబాద్‌లోని షాహినాథ్ గంజ్‌లో నిన్న సాయంత్రం చోటు చేసుకు పరవుహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అయితే.. నీరజ్ పన్వార్ అనే యువకుడిపై కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపి కర్ణాటక గుడిమత్కల్ లో నిందితులను పోలీసులు గుర్తించారు. నీరజ్ అనే యువకుడినీ కిరాతకంగా హతమార్చింది.. ఆయన బావమరుదులు, స్నేహితులేనని గుర్తించి.. వారిని కర్ణాటక గుడిమిత్కల్ లో…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారం ముగిసింది. సిర్పూర్‌కర్ హైపవర్ కమిషన్ నివేదికపై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కూడా హాజరయ్యారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ ఎన్‌కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని కోర్టు తేల్చిన సుప్రీం.. ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. చట్ట ప్రకారం…