కరోనా మహహ్మరి మానవాళిని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న కరోనా నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రజలు సతమతమయ్యారు. దీంతో థర్డ్ వేవ్ ప్రారంభం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టం చేయడంతో.. థర్డ్‌వేవ్‌ను ఆదిలోనే అంతం చేయగలిగాం. అయితే.. ఇటీవల కరోనా పుట్టినిల్లు చైనాలో.. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ కేసులు భారీ నమోదవతుండటంతో అక్కడి లాక్‌డౌన్ విధించారు. ఇప్పడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలపై సడలింపు ఇచ్చారు. న్యూయార్క్‌లో కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు భారీగా నమోదువుతున్నాయి. అంతేకాకుండా ఇంతవరకు కరోనా కేసులే లేని ఉత్తర కొరియాలో కూడా కరోనా వ్యాప్తి చెందుతోంది.
దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాడు. అయితే… తాజా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసు హైదారబాద్‌లో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. వివిధ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ‘బీఎ.4’ తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్‌తో కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి. ఇది మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది.
కరోనా బారినపడిన వారికి, ఇప్పటికే టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే, ఇది ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు కానీ, వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ పేర్కొన్నారు.