Andhra Pradesh: ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Weather: వర్షాకాలంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు దంచికొట్టగా ప్రస్తుతం ఆ బాధ్యతను భానుడు అందుకున్నాడు. దీంతో ఏపీలో వర్షాకాలంలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో తిరుపతిలో అత్యధికంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 36.9, అనంతపురంలో 34.9, కడపలో 36.2, కాకినాడలో 34.6, కళింగపట్నంలో 33.2, కర్నూలులో 33.4, మచిలీపట్నంలో 35.1, ఒంగోలులో 36.1, నందిగామలో 34.1, గన్నవరంలో 35.2, జంగమేశ్వరపురంలో 35.0, కావలి 35.8, బాపట్ల 35.6, నర్సాపూర్ 34.2, తునిలో 36.1,నంధ్యాల 35.5, ఆరోగ్యవరంలో 32.0 సెంటీగ్రేడ్‌మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Read Also: Schools Bandh: విద్యార్థులకు అలర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాలలో స్కూళ్లు, కాలేజీలు బంద్
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
అటు తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పొడిగాలులు వీస్తున్నాయని.. రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. వచ్చే వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు. గత ఏడాది ఆగస్టు నెలలో హైదరాబాద్ నగరంలో 34.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో ఆగస్టు నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు 2015లో నమోదయ్యాయి. 2015 ఆగస్టులో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు గుర్తుచేస్తున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!