ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి కోర్టులో ఊరట దక్కలేదు. అటు ఇంటర్ బోర్డు కూడా వెనక్కి తగ్గడం లేదు. మిక్స్డ్ అక్యుపెన్సీ భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం బోర్డు లక్ష రూపాయలు ఫైన్ వేసింది. దీంతో కొన్ని కాలేజి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రేపే ఇంటర్ ఫీజ్ కట్టేందుకు చివరి తేదీ కావడంతో ఈ లక్ష రూపాయలు కట్టేందుకు కళాశాలలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థి వద్ద లేట్ ఫీ రూపంలో 2 వేల 500 రూపాయల ఎగ్జామ్ ఫీ చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి.
READ MORE: Nigerian Army: నైజీరియా సైన్యం ఊచకోత.. 79 మంది ఉగ్రవాదులు హతం
కాగా… ఈ ఏడాది ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు దకకపోవడంతో విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. ఈ కాలేజీల్లో సెకండియర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థుల విషయంపై మాత్రం ఎటూ తేల్చలేదు. ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతివ్వాలన్న ప్రైవేట్ కాలేజీల విజ్ఞప్తితో ఈ ఒక విద్యాసంవత్సరానికి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డు లక్ష రూపాయల ఫైన్ వేసింది. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇంటర్ బోర్డు పెత్తనం ఏంటి అంటూ.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రశ్నించింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లక్ష రూపాయలు కట్టమంటూ మొండిపట్టుపట్టాయి. లక్ష రూపాయలతో పాటు… విద్యార్థుల ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు ఒక్కో విద్యార్థికి 2 వేల 500 రూపాయల ఆలస్య రుసుము చెల్లించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
READ MORE: Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి మృతి