అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుందని ఆర్పి పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో నిర్మించిన సినిమా W/O అనిర్వేష్. ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. నిర్మాతలు వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర సారథ్యంలో సినిమా నిర్మించారు. రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు…
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆడియన్స్‌ను హుషారెత్తించే అప్ డేట్ వచ్చింది. రేపు తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తండేల్ జాతర పేరుతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు.
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య ఓ జాతీయ మీడియా సంస్థకు…
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చ పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన పై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
రేపు తిరుపతిలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించనున్నారు. మంగళంపేట అటవీశాఖ భూ అక్రమాలు విచారణలో సమయంలో నాగబాబు పర్యటన ఆసక్తి రేపుతోంది. కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన పుంగనూరు నియోజక వర్గంలో ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ నిర్వహించనున్నారు. “జనంలోకి జనసేన సభ” పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమానికి నాగబాబు హాజరవుతారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే…
వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం.
సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇటీవలే లాంచ్ అయిన స్కోడా కైలాక్ సంచలనాలు సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 10 రోజుల్లోనే 10,000కు పైగా బుకింగ్స్‌ను సాధించి రికార్డు బద్ధలు గొట్టింది. గతంలో ఈ కారు బేస్ వేరియంట్ కోసం కస్టమర్ల నుంచి అత్యధిక బుకింగ్స్ రావడంతో కంపెనీ వెంటనే బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కస్టమర్లకు శుభవార్త…
రిపబ్లిక్ డే రాష్ట్రాల శకట ప్రదర్శనలో ఏపీ శకటానికి థర్డ్ ప్లేస్ వచ్చింది.. ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్‌తో ఏపీ శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది.. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్), రెండో స్థానంలో త్రిపుర (14 దేవతల ఖర్చి పూజ) నిలిచాయి. రక్షణ శాఖ ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను ప్రకటించింది. మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో దిల్లీ పోలీసు కవాతు బృందానికి…