అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరని తెలిపారు. “వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తాం. ఉపాధి హామీలో నమోదై, కనీసం ఇరవై రోజులు పని చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తాం. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం నాలుగు పథకాలపై సమీక్ష చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జనవరి 26న ఇస్తామని ప్రకటించాము. గ్రామ సభలు నిర్వహించి, అర్హత కలిగిన లబ్ధిదారులకు అందరికి ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. ఇండ్లు, రేషన్ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. జనవరి 26 పరమ పవిత్రమైన రోజు… భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం లాంఛనంగా పథకాలు ప్రారంభిస్తాం. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఈ 4 పధకాలు ఇస్తాం.” అని భట్టి విక్రమార్క తెలిపారు.
READ MORE: Saif Ali Khan Attack: సైఫ్ ఎటాక్ నాటి బట్టలు సేకరించిన పోలీసులు.. ఎందుకంటే?
మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రేపు నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తాం. రేషన్ కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇస్తాం. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. గతంలో దరఖాస్తు ఇచ్చినా, సర్వేలో వివరాలు ఇచ్చినా… ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోక పోయినా ఇప్పుడు ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వండి. Bpl కుటుంబాలందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. గత పదేళ్ళుగా దొడ్డు బియ్యం ఇచ్చారు. మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా అందిస్తాం. ఇకపై బయట ఆహార పదార్థాలు కోనుక్కోవాల్సి ఉండదని నేను అనుకుంటున్నాం.” అని మంత్రి తెలిపారు.