Reliance: బడ్జెట్‌కు ముందే రిలయన్స్‌కు భారీ షాక్.. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం
- భారీ నష్టాన్ని చవిచూసిన రిలయన్స్ ఇండస్ట్రీస్
- దాదాపు రూ.75 వేల కోట్ల నష్టం
- క్షీణించిన ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ కు వారం రోజుల ముందు దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు పడిపోయిన కారణంగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ నుంచి దాదాపు రూ.75 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.74,969.35 కోట్లు తగ్గి రూ.16,85,998.34 కోట్లకు చేరుకుంది. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం రావడంతో కంపెనీ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. మరోవైపు, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్‌లో కూడా భారీ క్షీణత కనిపించింది. దేశంలో రెండో అతిపెద్ద రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా క్షీణించింది. అయితే, గత వారం దేశంలోని 10 అత్యంత విలువైన కంపెనీల్లో నాలుగు కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,25,397.45 కోట్లు క్షీణించింది.
READ MORE: Kia Syros : కియా సిరోస్ ఈ 2 వేరియంట్లకు భారీ డిమాండ్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా ?
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
మరోవైపు దేశంలోని టాప్ 10 కంపెనీల్లో 6 కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్‌లో ఏకంగా రూ.58,554.88 కోట్లు పెరిగింది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్‌లో అత్యధిక పెరుగుదల కనిపించింది. టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎయిర్‌టెల్, ఐటి, హెచ్‌యుఎల్ మార్కెట్ క్యాప్‌లో పెరుగుదల కనిపించింది. గత వారం, బీఎస్‌ఈ సెన్సెక్స్ 428.87 పాయింట్లు లేదా 0.55 శాతం పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు (0.47 శాతం) పడిపోయింది.
READ MORE: Donald Trump: గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!