హైదరాబాద్ నగర పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ బలగాలు మరియు రిటైర్డ్ పోలీసు సిబ్బంది నుండి పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారులుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానించారు. ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ సమయంలో మొత్తం 150 SPOల ఖాళీలు భర్తీ చేయబడతాయి. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి అంటే ఆధార్ కార్డ్, ఓటర్ ID మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మరియు మాజీ సైనికులు…
తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఏపీలో మొత్తంగా 4.08 కోట్ల ఓటర్లున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే 5.85 లక్షల ఓటర్ల మేర పెరిగారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందేందుకు పలు సూచనలు, ప్రతిపాదనలను ఈ బృందం ఉప ముఖ్యమంత్రికి అందచేసింది. రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే…
అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బీసీలపై పడి వారిని భయబ్రాంతులను చేసిన పరిస్థితి ఆ సమయంలో నెలకొందన్నారు. బీసీలను బాక్ వర్డ్‌గానే చంద్రబాబు చూశారని.. బీసీలను బాక్ బోన్‌లా సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన చెప్పారు.
కార్యకర్తలు మంచి సూచనలు చేశారని, పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యల కోసం డిమాండ్లు వచ్చాయని తెలిపారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు. ఇవాళ నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సంస్థాగత బలోపేతం పై సూచనలు వచ్చాయని, గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ముందుకు సాగుదామని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడ్డ వారికే పార్టీ లో గుర్తింపు ఇస్తామని, ఉద్యమ కారులకు పార్టీ లో సముచిత…
దేశ వ్యాప్తంగా ఈరోజు రామ నామం చేస్తున్నారు.. జై శ్రీరామ్ అంటూ హోరేత్తిస్తున్నారు.. అయోధ్య లో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఎంత అంగరంగ వైభవంగా జరిగింది.. ఇలాంటి అద్భుతమైన రోజున కలర్ ఫోటో ఫ్రేం హీరో సుహాస్ తండ్రి అయ్యాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. కేరీర్ మొదట్లో షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు…
ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. జిల్లాల్లో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్ల జారీకి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీల టెర్మినేషన్కు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరనివారిని తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నేడు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నిక ధ్రువీకర పత్రం తీసుకున్నారు వెంకట్..మహేష్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని, బల్మూరి వెంకట్…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు.