ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళుర్పించారు. నేతాజీకి నివాళులర్పిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
అయోధ్యను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. అయోధ్య ఈవెంట్‌తో దేశం సంతోషంగా వుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఎంపికపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తున్నట్లు టాక్.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్‌కు ఒక ప్రతిపాదనను పంపింది. అందులో 2 నెలల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తుంది.. అతి చిన్న వయస్సులో భారీగా సంపాదిస్తుంది.. మహేశ్ కూతురు సితార పుట్టినప్పటి నుంచే ట్రేండింగ్ లో ఉంది.. మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈమె ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు టీనేజీలోకి వచ్చిన తర్వాత సితార మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది.. ఇక ఈ అమ్మడు సంపాదన కూడా ఓ…
Ayodhya : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.