బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రయంగా విసిరికొట్టిన నాపై.. మద్యనిషేదంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు వెంకట్‌రెడ్డి. ప్రజలు నమస్తే పెడితే ఎక్కడ పని అడుగుతారో అని మోహం కిందకు వేసే అహంకారి వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే నాపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కుంభకోణం, భద్రాద్రి ప్లాంట్ లో అక్రమాలు, ఛత్తిస్ ఘడ్ కరెంట్ కొనుగోళ్ల దోపిడీలు బయట పెడుతున్నాననే నాపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరు ఆపలేరని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ప్యారాగన్ స్లిప్పర్లు వేసుకున్న వ్యక్తి ఇవ్వాల వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్ లు ఎట్లొచ్చినయి.. తెలంగాణ ప్రజలకి చెప్పాలే అని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో కేసియర్ కుటుంబం తర్వాత జైలు కు పోయే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలో బావ బామ్మర్థులు తన్నుకుంటుంటే విషయం బయటికి పొక్కకుండా కెసిఆర్ ఆడించే జోకర్ జగదీష్ రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర వ్యక్తి నిత్యం ప్రజల్లో, ప్రజల కోసం బతికే నాపై ఆరోపణలు చేస్తాడా.. నల్గొండ ప్రజలు జగదీష్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.