AP Bandh: అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్‌కు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Bandh: అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి. ఈ పిలుపును రాష్ట్ర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, వివిద వర్గాల ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్, టీఎన్టియూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్, తదితరులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
Read Also: Merugu Nagarjuna: చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడా జరిగి ఉండవు..
Also Read
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
మరోవైపు.. దీక్షలో కూర్చున్న అంగన్వాడీలను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారని ఏపీ అంగన్వాడీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి తీవ్రంగా మండిపడ్డారు. మహిళలని చూడకుండా రోడ్డుపై ఈడ్చి పారేసిన చర్యలను ఖండిస్తున్నామన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కోటి సంతకాల సేకరించి సీఎంకు అందించాలని భావించామన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా మా పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. అనేక పోలీస్ స్టేషన్లకు తరలించినా అక్కడ కూడా మా అంగన్వాడీలందరూ ఆందోళన చేపడుతున్నారన్నారు. ఎంత దూరం వదిలేసినా మళ్లీ విజయవాడ వచ్చి ఉద్యమం కొనసాగించి తీరుతామన్నారు. అంగన్వాడీ మహిళలందరూ కూడా ఇళ్లకు వెళ్ళవద్దన్నారు. ఎక్కడ అయితే అరెస్టు లో ఉన్నారో అక్కడే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్టేషన్ నుంచి వదిలిన వెంటనే మళ్లీ విజయవాడ తరలి రావాలని కోరుతున్నామన్నారు. మా ఉద్యమాన్ని అంచివేయాలని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నాయకులు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని అంటున్నారని.. పోలీసులు వాటిని నిరూపిస్తే… ఆ కోటి వాళ్లకే ఇస్తామన్నారు. పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. అంగన్‌వాడీలను తొలగించి, ఇరవై వేల మందిని కొత్తగా నియమించామని అబద్దాలు చెబుతున్నారని.. అంగన్వాడీ మహిళా ఉద్యమాల వెనుక ఎటువంటి రాజకీయ శక్తులు లేవన్నారు. హక్కులు సాధించుకునే వరకు ఈ పోరాటం, ఉద్యమం కొనసాగుతుందన్నారు.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!