దేశ వ్యాప్తంగా ఈరోజు రామ నామం చేస్తున్నారు.. జై శ్రీరామ్ అంటూ హోరేత్తిస్తున్నారు.. అయోధ్య లో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఎంత అంగరంగ వైభవంగా జరిగింది.. ఇలాంటి అద్భుతమైన రోజున కలర్ ఫోటో ఫ్రేం హీరో సుహాస్ తండ్రి అయ్యాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు..
కేరీర్ మొదట్లో షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేశాడు. ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. ఇతడు నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
ఈరోజు తన భార్యకు మగబిడ్డ పుట్టినట్లు సుహాస్ వెల్లడించాడు. ‘ప్రొడక్షన్ నం.1’ అని ఓ ఫన్నీ క్యాప్షన్‌తో తను తండ్రి అయిన విషయాన్ని బయటపెట్టాడు. ఇకపోతే సుహాస్ భార్య పేరు లలిత. వీళ్లిది ప్రేమ వివాహం. దాదాపు ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోక పోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భార్యతో ఉన్న ఫొటోలని సుహాస్ చేస్తుంటాడు.. ఇప్పుడు వీరి ప్రేమకు ప్రతి రూపంగా ఒక బుజ్జి బాబు వారి మధ్యకు వచ్చేశాడు..