సీఎం రేవంత్ రెడ్డి లండన్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళోజి నారాయణ రావు మాటలను.. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అనే మాటలను బి. ఆర్. ఎస్ నేతలకు వర్తిస్తుంది ..అందుకే సీఎం మాట్లాడాడని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్లు రాష్టాన్ని కమీషన్ లకు కక్కుర్తి పడి అప్పులకుప్పగా మార్చారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం.. మీ ధన దాహానికి ప్రత్యక్ష ఉదాహరణ అని…
చారిత్రక సాలార్‌జంగ్ మ్యూజియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు అధునాతన బ్లాక్‌లను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ ని సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 1951 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మకమైన సాలార్‌జంగ్ మ్యూజియం.. రోజురోజుకూ కొత్త కళాకృతులు, దేశ, విదేశాల చిత్రాలను ప్రదర్శిస్తూ.. 72 ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉందన్నారు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటుండటం హర్షదాయకమన్నారు. ఇవాళ కూడా ఈ…
దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక స్కై స్కాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి ఏరియల్ వ్యూ లా కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టు…
పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, కాబట్టి తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం నాడు జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో రాత్రి వరకు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయపు జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్ తో మంత్రి…
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లతో సవివరంగా చర్చించారు. వివిధ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి లండన్ నుంచి దుబాయ్ వెళ్లారు. బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలు ప్రధానంగా 56-కిమీ పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం మరియు వాణిజ్య అనుసంధానాలు మరియు పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. అధికారిక ప్రకటన ప్రకారం, దుబాయ్‌లోని సమావేశాలు 70కి పైగా విభిన్న…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సౌత్ ఆఫ్రికా లేడి కిలాడి హ్యాండ్ బ్యాగ్‌లో హెరాయిన్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాంబీయా నుండి హైదరాబాద్ వచ్చిన సౌత్ ఆఫ్రికా జాతీయురాలి వద్ద డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. హ్యాండ్ బ్యాగేజ్‌లో దాచిన హెరాయిన్…
ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మీంచి అమలు చేయలేరని, మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడన్నారు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన…
ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబాకు సాంప్రదాయ పూజలతో ఆదివారం మహా క్రతువు మొదలైంది. ఆదిలాబాద్ కేస్లాపూర్లో నాగోబా జాతర తేదీలను నిర్ణయించారు మేస్త్రం వంశీయులు. పుష్యవాస అమావాస్యను పురస్కరించుకొని ఫిబ్రవరి 9 నుండి మొదలయ్యే కేస్లా పూర్ నాగోబా జాతర ఉత్సవాల కోసం ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సన్నిధిలో మెస్రం వంశీయులు సమావేశమై పాదరక్షలు లేకుండా కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు ప్రాంతానికి బయలుదేరారు. సుమారు…
అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహం ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం వెల్లడించారు. ఫలితంగా, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్కు ప్రాతినిధ్యం ఉండదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని కవిత మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, శ్రీరాముడు ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందినవాడు…
పేద ప్రజల కోసమే భారత్ వికాసిత్ భారత్ సంకల్పయాత్ర అని అన్నారు జనగామ జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ఈ పథకం ద్వారా మూడు కోట్ల ఇల్లు మంజూరు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈ పథకం అమలు చేయడం జరిగింది, తెలంగాణలో ఇంకెవరైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందని వారు మరోసారి కూడా లబ్ధి పొందవచ్చన్నారు ఆర్కే సింగ్. పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు ఆరోగ్యం, అక్షయ…