Jodhpur Sisters: తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే ఆ*త్మహ*త్య చేసుకున్న అక్కాచెల్లెళ్ళు
- 25 ఏళ్లు, 23 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్ళు
- తమ వివాహం జరిగే రోజున ఆత్మహత్య
- జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందినవారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. 25 ఏళ్లు, 23 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తమ వివాహం జరిగే రోజున ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శనివారం (ఫిబ్రవరి 22, 2026) ఉదయం వెలుగులోకి వచ్చింది. శోభ (25), విమల (23) ఇద్దరూ దీప్ సింగ్ కుమార్తెలు. జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందినవారు. ఇద్దరు సోదరీమణులకు ఒకే రోజు (శనివారం) డబుల్ వెడ్డింగ్ జరగనుండగా, శుక్రవారం రాత్రి బండోలి (బంధన్) వేడుకలు పూర్తయ్యాయి.
Also Read:Jai Hanuman : అంజనాద్రి సాక్షిగా ‘జై హనుమాన్’ షురూ.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఎంట్రీ..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అయితే, శనివారం ఉదయం 4 గంటల సమయంలో వారి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే సమయానికి ఇద్దరినీ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వారు విషపదార్థం (పురుగుల మందు లేదా ఇతర విషం) సేవించినట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యే అని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి.
Also Read:Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వివాహాల కోసం ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబం, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది కుటుంబ ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్‌నాచురల్ డెత్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో సంచలనం రేపింది. మరిన్ని వివరాలు పోస్ట్‌మార్టం, పోలీస్ దర్యాప్తు తర్వాత వెల్లడికానున్నాయి. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అత్తవారింట్లో భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతారని భావించిన తల్లిదండ్రులు తమ కూతుర్లు విగతజీవులు కావడంతో గుండెలవిసేలా రోదించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!