తనను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్న బండి సంజయ్ నాటి మంత్రి కేటీఆర్ తాను ప్రతిపాదించిన కొన్ని కంపెనీల వద్దే యార్న్ కొనుగోలు చేయాలని షరతు పెట్టడంతో అధిక ధరకు…
పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరన్నారు. గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారని, చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదని,…
ఎన్నికల పై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నామన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి 80 శాతం ప్రజలకు చేరిందని, కూటమికి అజెండా లేదన్నారు. అధికారం కోసమే పొత్తులతో టీడీపీ కూటమి నానా జాతి సమితి ఒకవైపు అని, మంచి చేసిన మేము ఒక వైపు అని ఆయన వ్యాఖ్యానించారు. నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. 2014 -19 అరాచక ప్రభుత్వం కావాలా…
ఈటల రాజేందర్ రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చరిత్ర.. రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, ఆయన ముందు వీళ్లంతా చిన్న వ్యక్తులు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులకు స్పష్టంగా చెబుతున్నానని, దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోడీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ గురించి కానీ .. మోడీ గురించి చెప్పాల్సిన అవసరం…
ఈనెల 26,27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంపై తుది కసరత్తు జరుగుతోంది.
ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహిని అలంకారంలో కోదండ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి బస చేసిన చిన్నయపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు.