ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వదర్లపాడు పంచాయతీ నుంచి 200 మంది, ఆలపాడు పంచాయతీ నుండి 200 మంది ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వర రావు, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వర రావు, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ లు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజమని, అందుకే మోడీని తిట్టిన నోటితోనే ఇప్పుడు జైకొడుతున్నాడని అన్నారు. ప్రజాగళం సభలో మైకు మూగబోయిందంటే అది అపశకునమేనని, అది కూటమి ఓటమిని సూచిస్తోందని చెప్పారు. అనంతరం కారుమూరు సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. మొదటిగా వారు చేసేది.. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడమేనని ఆయన అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటూ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే బీజేపీ పంచన చంద్రబాబు చేరాడని, దీనికి కారణం కేసుల భయమేనని అన్నారు.