Kakani Govardhan : పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరన్నారు. గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారని, చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదని, అందుకే ఏమీ చెప్పుకోలేక పోయారని, అందుకే నన్ను.జగన్ ను తిట్టారన్నారు. నా మీద చంద్రబాబు అభియోగాలు చేశారని, ఆ అభియోగాలపై సి.బి.ఐ.విచారణ జరిపించాలని కోర్టు ను కోరేందుకు నేను సిద్ధమన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. దమ్ముంటే చంద్రబాబు..కూడా తన పై వచ్చిన అభియోగాల పై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. సర్వేపల్లి లో చంద్రబాబు కె.జి.ఎఫ్..అన్నారు. సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తా రండి. వాటిని చూస్తే కుప్పంలో ఎందుకు ఈ పనులు చేయలేకపోయానని చంద్రబాబు బాధ పడతారు. ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం లేదు. పొదలకూరు సభకు ప్రజలు రాకపోతే నేను ఆపానని చంద్రబాబు ఆరోపించారు. సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారు. ప్రజలు రాకపోవడంతో అసంతృప్తి లో నన్ను..జగన్ ను తిట్టారు. జగన్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా వున్నారు. వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు హయాంలో వర్షాలు కురవలేదు. కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం జరిపించానని చెబుతున్నారు.
Also Read
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
- YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
కోర్టు లో ఫైళ్ల చోరీ పై సి.బి.ఐ.క్లీన్ చిట్ ఇచ్చింది. సర్వేపల్లిలో పోటీ చేసేందుకు పలువురిని ప్రయత్నించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల పార్టీలో చేరిన వారిని కూడా అడిగాడు. ఎవరూ రాకపోవడంతో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మార్పులు తీసుకొచ్చాను. సోమిరెడ్డి హయాంలో రైతులను దోచుకున్నారు. రైతు రథం లోకూడా కమిషన్లు కొట్టారు. జగన్ ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదు. టికెట్ల కేటాయింపులో జగన్ సామాజిక న్యాయం పాటించారు. వచ్చే ఎన్నికల్లో ఒక స్థానం కూడా టీడీపీ కి రాదు. కానీ చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నేతలు వై.సి.పి.ని. వీడినా ఇబ్బంది లేదు. సర్వేపల్లి నియోజకవర్గం లో దొరికిన మద్యం పై విచారణ జరుగుతోంది.’ అని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?