Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Comments On Brs And Congress 6

Bandi Sanjay : నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు

Published Date :April 21, 2024 , 5:29 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay : నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తనను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్న బండి సంజయ్ నాటి మంత్రి కేటీఆర్ తాను ప్రతిపాదించిన కొన్ని కంపెనీల వద్దే యార్న్ కొనుగోలు చేయాలని షరతు పెట్టడంతో అధిక ధరకు యార్న్ కొనుగోలు చేసిన నేతన్నలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా.. యార్న్ కొనుగోలులో అక్రమాలపై విచారణ జరపాలని సవాల్ విసిరారు.

ఈరోజు సిరిసిల్ల విచ్చేసిన బండి సంజయ్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నుండి టౌన్ మొత్తం తిరుగుతూ శాంతినగర్ హనుమాన్ ఆలయ సమీపం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధూమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు…..

రాముడంటే భక్తి ఉండాలి తప్ప… బీఆర్ఎస్, కాంగ్రెసోళ్లకు రాముడి పేరు వింటేనే భయం పట్టుకుంది. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అనేటోళ్లను ఏమనాలె? వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. మహాలక్ష్మీ పథకం కింద మహిళల అకౌంట్లో నెలనెలా రూ.2500లు ఎందుకు వేయడం లేదు? రూ.4 పెన్షన్, రైతు భరోసా, పేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీ గుడిని మింగితే కాంగ్రెస్ గుడిలో లింగాన్ని కూడా మింగే టైపు..

బీఆర్ఎస్ అరాచకాలపై, అవినీతి, అక్రమాలపై బీజేపీ అలుపెరగని పోరాటాలు చేస్తే కాంగ్రెస్ కు ఓటేయడం ఎంత వరకు న్యాయం ఆలోచించాలి… గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు…ప్రజలు వాస్తవాలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు సిద్ధమైనరు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించనేలేదు… వీరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు.

సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభం సమసిపోలేదు. మీరంతా ఐక్యంగా ఉంటూ సమ్మె చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి నేను లేఖ రాసిన. అనేక రూపాల్లో సర్కార్ తీరును ఎండగట్టిన. అయినా స్పందించకపోవడంతో నేతన్నకు మద్దతుగా దీక్ష చేసేందుకు సిద్దమైతే తప్ప ప్రభుత్వం దిగిరాలేదు.. రూ.270 కోట్ల బకాయిలుంటే… కంటి తుడుపు చర్యగా రూ.50 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… ఎన్నికల కోడ్ పేరుతో ఆ నిధులను కూడా ఆపేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారు.. అదే జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు.. దీంతపాటు మిగిలిన బకాయిలన్నీ నేతన్నలకు చెల్లించాల్సిందే..

సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బీఆర్ఎస్సే. మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం వెంటనే పాత బకాయిలన్నీ చెల్లించాలి. ఏడాది పాటు ఉపాధి కి ఇబ్బంది లేకుండా కొత్త ఆర్డర్లు ఇవ్వాలే… పాత విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలే. 50 శాతం సబ్సిడీతో విద్యుత్ బిల్లులను పునరుద్దరించాలే.. కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలి. గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని కొనసాగించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నం. వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడానికి, నేతన్నలకు నేను ఎప్పుడూ అండగా ఉంటా. కేసీఆర్ మెడలు వంచి గద్దె దించిన చరిత్ర బీజేపీది.

కరీంనగర్ జిల్లాలో కేటీఆర్, జిల్లా మంత్రి కుమ్కక్కై పనిచేస్తున్నరు. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారు.. గతంలో కేటీఆర్ ప్రతిపాదించిన కంపెనీల వద్ద మాత్రమే యార్న్ కొనుగోలు చేయాలని నేతన్నలను బలవంత పెడుతూ భారీ ఎత్తున దోపిడీ చేస్తుంటే.. మంత్రి ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరపాలి. నేతన్నల సంక్షేమం కోసం పనిచేయకుండా వెధవ.. అంటూ బూతులు తిడుతూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నరు. కండకావరంతో వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ జిల్లాకు వస్త్తుంటే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి గ్రుహ నిర్బంధానికే పరిమితం చేసేవారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపినా వెనుకాడలే. గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరాడి కేసీఆర్ మెడలు వంచిన. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడిన. వాస్తవాలు ఆలోచించండి. దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మోదీకి మద్దతివ్వండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని వంద శాతం పోలింగ్ జరిగేలా చూడండి. పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా..’ అని బండి సంజయ్‌ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • breaking news
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Jammu Kashmir: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్..

  • Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్ వస్తువుల సరఫరా..!

  • Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం..

  • KKR vs RR: రాజస్థాన్ పై విరుచుకుపడిన స్పిన్నర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?

  • CSK: సీఎస్‌కు బిగ్ షాక్.. టీమ్ నుంచి మరో బిగ్ ప్లేయర్ ఔట్..

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions