సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అని ఆయన అన్నారు. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు ఇంకా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటిలే మీకు భస్మాసురహస్తం అవుతాయన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారని, మిమ్మల్ని…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది. ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస…
పార్లమెంటు మొదటి ధశ ఎన్నికలు కాగానే మోడికి భయం పట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అదానీ, అంబానీకి తప్పా సామాన్యుడికి న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. పదేండ్లలలో బీఅర్ఎస్, బీజేపి ఏమి చేయలేదని ఆయన అన్నారు. బండిసంజయ్ పై అవినీతి, ఆరోపణలు వచ్చాయి కాబట్టే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని, తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండిసంజయ్ అని ఆయన…
రేపు హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర సందర్భంగా… ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ విడుదల చేశారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవెర్షన్ రూట్ లో వెళ్లాలని సూచించారు. రేపు హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కి వెళ్తుందని,…
మోడీ ఆరోపణలు చూస్తుంటే ఎంత భయంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. . కాంగ్రెస్ మేనిఫెస్టో తెలిసి మాట్లాడుతూ ఉన్నారా..చూడకుండా మాట్లాడుతున్నారా ..? అని ఆయన ప్రశ్నించారు. కార్పోరేట్ మిత్రులకు రుణాలు మాఫీ చేశారు కానీ రైతుల కోసం మాత్రం మాఫీ చేయలేదని, . హిందు..ముస్లిం గురించి మాట్లాడతారా ఛీ.. యువకులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. హిందు మహిళల తాళిబొట్టు ముస్లిం లకు ఇస్తారు అని మోడీ అనడం చూస్తుంటే ఏడవలా..…
బీజేపీతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అని కేసీఆర్ అన్నారని, గతంలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేసిన యత్నాలను కేసీఆర్ ఉదాహరించారన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఓ సీనియర్ కాంగ్రెస్ నేత 20 ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఆంటే వారించా అని కేసీఆర్ ఆ రోజు చెప్పారన్నారు. రేవంత్ మాత్రం ప్రతీ సభ లో కేసీఆర్ తన ప్రభుత్వానికి కూలుస్తారన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రభుత్వం రాగానే 30 వేల ఉద్యోగాలు…
మోడీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగం మారుస్తారని ఖర్గే అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏపై కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ముస్లిం, పాకిస్థాన్ వంటి దేశాల్లో హిందువులను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, వారిని ఆదుకునేందుకే సీఏఏ అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ దీనిపై చిదంబరం తప్పుడు…
నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రు పాలన తప్పు పట్టె వాళ్ళు .. నెహ్రు ఉన్నప్పుడే మోడీ పుట్టి ఉంటే బాగుండేది.. మా తప్పు కాదు అది అని, శ్రీరాముడు కూడా దేశానికి మొదటి ప్రధాని నెహ్రు కావాలి అని ఆయన్నే పుట్టించారన్నారు. .గాంధీ..నెహ్రు ల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. సీఎం ని కలిసి…
ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని, ఏ ఊరికి వెళ్లిన అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ 20మంది టచ్ లో ఉన్నారనే మాటలు చూస్తే .. కేసిఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారేమో అని ఆయన అన్నారు. నాకు అయితే అదే అనుమానం ఉందని, సీఎం హామీలను…
కాంగ్రెస్ సంపదను, మహిళల పుస్తెలు.. ముస్లిం లకు పంచుతామనీ అంటున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హెచ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులు ఉంటాయని మర్చిపోయారని, ముస్లిం ఓట్లు బీజేపీ పడవని ఇలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో బీజేపీ ఏం చేశావో చెప్పు అని, ధరలు పెంచినందుకు.. ఉద్యోగాలను ఇవ్వనందుకు బీజేపీ కి ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాహుల్…