రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సెక్షన్ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదని.. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టనుంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఓటీటిలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక టీవీ లో ప్రసారం అయ్యేందుకు రెడీ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. కేవలం సినిమాను చూడటం మాత్రమే కాదు.. సినిమాను…
గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా వదలని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలను తెచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ పనులు మొదలు అయ్యాయని ఆయన అన్నారు. జిందాల్ స్టిల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గండి కోట ప్రాజెక్ట్ ద్వారా 26 టీఎంసీల నీళ్లు నిలువ చేయగలిగాము కాబట్టి, ప్రజల దాహార్తి తీర్చగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. కడప రిమ్స్…
విజయవాడ సీఎం జగన్‌పై రాయి దాడి కేసుపై వెలంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమా జగన్ పై దాడి చేయించారన్నారు. మొదట్లో వన్ టౌన్ నుంచి రౌడీ షీటర్లను తెచ్చి రాళ్ళు వేశామన్నాడు బోండా అని ఆయన ఆరోపించారు. బోండా ఉమా రాయి దాడిపై రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాయి దాడి మూలాలు బోండా ఉమా ఆఫీసు చుట్టు తిరుగుతున్నాయని ఆయన…