Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణానికి చెందిన మట్ల రామలక్ష్మణులు.. నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీసీ వర్గానికి చెందిన రామలక్ష్మణులు తమ సొంత నిధులతో పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో మంచినీటిని సరఫరా చేస్తూ అపర భగీరథులుగా పేరు తెచ్చుకున్నారని వారు వెల్లడించారు. మట్ల రామయ్య కోడలు ఉదయగిరి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో అనేక వాహనాలలో పార్టీ కార్యాలయానికి చేరుకుని సుమారు 1000 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితోపాటు తిరువాయి పాటీ రామచంద్రయ్య, తోకల కొండయ్యలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఉదయగిరి గౌశయ్య ఆధ్వర్యంలో 100 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్‌లు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మాపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరి శుభాకాంక్షలు తెలపడం శుభ పరిణామం అన్నారు. అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాన్ని గత సంవత్సరం చంద్రబాబు చేతుల మీదగా ప్రారంభించామన్నారు. సరిగ్గా ఒక సంవత్సరం కాలం పూర్తయిందన్నారు. 29 వేల మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. పేద ప్రజల కోసం ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రె,డ్డి వింజమూరు ఎంపీపీ ఐ మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, ఉదయగిరి మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎం. వెంకటరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, కలిగిరి మండల కన్వీనర్ బొజ్జం వెంకటకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన 100 కుటుంబాలు
దుత్తలూరు మండలం బండ కింద పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అంకినపల్లి రమేష్ రెడ్డితో పాటు గ్రామంలోని 100 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటివరకు వైసీపీ పార్టీ సర్పంచ్‌గా ఉన్న రమేష్ తెలుగుదేశంలో చేరారు. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డిలు రమేష్ రెడ్డితో పాటు గ్రామస్తులందరికీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కంభం మాట్లాడుతూ.. దుత్తలూరు మండలానికి ముఖ ద్వారమైన బండ కింద పల్లి గ్రామస్తులందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు. ముఖ్యంగా ఈ ఊరికి రోడ్డు మార్గం లేదన్నారు. తెలుగుదేశం అధికారంలోనికి రాగానే మొట్టమొదటిసారిగా ఈ రోడ్డును వేయిస్తామని తెలిపారు. కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. భూ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
ఉదయగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్ బాబు యాదవ్‌లు హాజరయ్యారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మేకపాటి శాంత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు చేస్తారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత ఘనమైన పుట్టినరోజు వేడుకలు జరపడం ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానం అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం అని అన్నారు. మే 13న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎండిపోయిందని అది చిగురించాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ముందుగా 74వ పుట్టినరోజు కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం శాలువా పూలమాలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కాకర్ల సురేష్‌ను, కంభం విజయరామిరెడ్డిని, వంటేరు వేణుగోపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
జిర్రావారి పాలెంలో తెలుగుదేశం ఇంటింటి ప్రచారం..!
కలిగిరి మండలం జిర్రావారి పాలెం గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలు, కాకర్ల సురేష్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజాసేవకు అంకితమైన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొజ్జం వెంకటకృష్ణారెడ్డి, కాకు ప్రసాద్, భాషిం నర్సింహులు, జె మూడవ అంకిరెడ్డి, జె పెద్ద అంకిరెడ్డి, కొప్పోలు కొండలరావు, ఊస మాల్యాద్రి, సురేష్, బత్తల రాజయ్య, జె వెంకటేశ్వర్ రెడ్డి ,మోడీ సింగయ్య, స్వర్ణ కొండయ్య, కొండపల్లి వెంకట్రావు, చీమల తాతయ్య, వనిపెంట సుబ్బారెడ్డి, కుట్టు బోయిన మాలకొండయ్య, జె సురేష్, కొప్పోలు మహేష్ వల్లెం సురేష్, తదితరులు ఉన్నారు. మరోవైపు.. ఉదయగిరిలో జరిగిన నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో విరువూరు ఎంపీటీసీ సభ్యులు కాలే లక్ష్మీదేవి, కాలే రమణయ్యలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం లో చేరారు.
టీడీపీలో చేరిన కాకు శ్రీనివాసులు, మురళి నిమ్మకాయల
దళిత దిగ్గజం కాకు శ్రీనివాసులు (లా ఆఫీసర్), మురళి నిమ్మకాయల వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
వింజమూరు మండల కేంద్రంలోని ప్రధాన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దళిత నాయకుడు వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారు తమ అనుచర వర్గంతో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపి పార్టీ ఆవిర్భావం ముందు తెలుగుదేశం కుటుంబ సభ్యులమని, అనివార్య కారణాల చేత పార్టీని వేడాల్సి వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడంతో పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు.
వింజమూరు
తెలుగుదేశానికి జిందాబాద్ కొట్టిన బోడ సిద్దయ్యపల్లె..!
సీతారాంపురం మండలం గుండుపల్లె పంచాయతీకి చెందిన బోడ సిద్దయ్య పల్లె గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
సీతారాంపురం మండల అధ్యక్షులు కప్ప ప్రభాకర్ రాజు, క్లస్టర్ ఇంచార్జ్ వెంగళ శెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీను ఆధ్వర్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వింజమూరులోని తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కార్యాలయం నందు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.బోడ సిద్దయ్య పల్లె గ్రామానికి చెందిన పీఏసీసీ మెంబర్ బంధుగుల వెంకటేశ్వర్లు, జోడు పుల్లయ్య, బంధుగుల సుబ్బయ్య, భూతపాటి శ్రీనివాసులు, బంధుగుల పోలయ్య, జోడి రఘురాములు, భూతపాటి రామాంజనేయులు, జోడి శ్రీనివాసులు, జోడి కృష్ణయ్యలకు కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోనికి ఆహ్వానించారు.
.
ఊటుకూరు పంచాయతీలో అత్తా కోడలు ఇంటింటి ప్రచారం..!
వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మస్తానమ్మ, మరదలు కాకర్ల సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన కుమారుడిని గెలిపించాలని అభ్యర్థించారు. అదేవిధంగా కాకర్ల సునీల్ సతీమణి ఇంటింటికి తిరిగి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్‌ను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని ప్రార్థించారు. ఊటుకూరు, తక్కెళ్ళపాడు, ఇందిరానగర్ కాలనీలలో విస్తృతంగా ప్రసారం నిర్వహించారు. పల్లె ప్రజలు అపూర్వ స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు.