Nara Brahmani: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని విజయం కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే విషయం తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని నారా బ్రాహ్మణి తాజాగా నెరవేర్చారు.
Read Also: Andhra Pradesh: దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
ఎన్నికల సందర్భంగా తమను కలిసిన నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు తమ అభ్యర్థనన తెలియజేసారు. కూరగాయలు అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యను అధికారులకు నారా బ్రాహ్మణి చెప్పారు. అయితే తాజాగా సమస్య పరిష్కారానికి కూరగాయల వ్యాపారులకు స్థలాన్ని మున్సిపల్ అధికారులు కేటాయించారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నారా బ్రాహ్మణికి కూరగాయల వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్య పరిష్కారమైందని సంతోషం వ్యక్తం చేశారు.