బీజేపీ నేతల మాటలకు మాజీ ఎంపీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని బీజేపీ నేతలు అంటున్నారని.. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతురావు అన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేసి దేశంలోని అన్ని కులాలకు న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రధాని మోడీ మాత్రం కులాల మధ్య రాహుల్ గాంధీ చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. 1931 లో కులగణన అయిందని.. తర్వాత కులగణనను ఎవరు పట్టించుకోలేదని తెలిపారు. ఇపుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50% సీలింగ్ ఎత్తేస్తా అని రాహుల్ గాంధీ అన్నారని.. రాహుల్ గాంధీ మాటలకు శరత్ పవార్ కూడా మద్దతు పలికారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేయాలని చూస్తున్నారన్నారు.
READ MORE: Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్: భారత మాజీ కెప్టెన్
తెలంగాణలో జరుగుతున్న కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వీహెచ్ తెలిపారు. కులగణన జరిగితే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో హిందు దేవుళ్ళ విగ్రహాలు కూల్చి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
READ MORE:CM Revanth Reddy: కుల గణన.. దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం.. సీఎం ట్వీట్ వైరల్..