తెలంగాణలో టి-డయాగ్నోస్టిక్స్ పథకంలో భాగంగా ఇప్పటికే 20 జిల్లాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తాజాగా మరో 13 చోట్ల నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా మరో 8 వైరాలజీ ల్యాబ్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారు రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్లను జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్…
ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ విద్యావేత్త, ప్రవాసాంధ్రుడు లకిరెడ్డి బాలరెడ్డి (88) అనారోగ్యంతో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడంలో జన్మించిన ఆయన పేరుతో ఇంజినీరింగ్ కాలేజీ కూడా నడుస్తోంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. 1960లో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి…
ప్రభుత్వ ఆస్పత్రులపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం ఉండదు. అక్కడ ఎక్విప్‌మెంట్ సరిగ్గా ఉండదని, వైద్యులు బాధ్యతగా వ్యవహరించరని అనుకుంటూ ఉంటారు. అందుకే వారు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన చికిత్స అందుతుందంటూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలని పలువురు రాజకీయ నేతలు, అధికారులు తాపత్రయపడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ తన భార్యకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలామంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. మరికొందరు కుటుంబసభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read Also: మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ ఈ మేరకు…
చలికాలం ప్రారంభం కావడంతో పొగమంచు హైదరాబాద్ నగరాన్ని కప్పేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్-హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు సన్ సిటీ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా…
భారత ప్రధాని మోదీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్‌లో 2021 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని వినియోగదారుల నిఘా కంపెనీ ‘బ్రాండ్ వాచ్’ తమ వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. మొత్తం 50 మంది వ్యక్తులతో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో సింగర్…
సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 17, 24 తేదీల్లో స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి,…
మొన్న జరిగిన టీ20 పరిణామాల తరువాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రోహిత్ శర్మ ను కెప్టెన్గా ప్రకటిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్.. రోహిత్ గుడ్ ఛాయిస్ అంటూ కితాబిచ్చారు. వచ్చే ఏడాదిలో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇండియాకు కప్పు అందించే సత్తా ఉన్నవారినే మార్గదర్శగా నిర్ణయించడ మంచిదని అందుకు.. రోహిత్ కి కెప్టెన్సీ ఇవ్వడం మంచిదన్నారు. రోహిత్…
డాన్సర్ ను హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ తో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాన్సర్ ఫాతిమా భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ తో పరిచయం పెంచుకున్న ఫాతిమా.. ఆ పరిచయంను కాస్తా అక్రమ సంబంధంగా మారింది. కొన్ని రోజుల తరువాత తనను వివాహం చేసుకోవాలంటూ డ్రైవర్ ను ఫాతి మా ఒత్తిడి చేసింది. దీంతో డ్యాన్సులు చేయడం వదిలిపెడితే వివాహం చేసుకుంటానని ఫాతిమాకు షరతు విధించాడు…
ఓ కంపెనీకి సంబంధించి నకిలీ భూ పత్రాల సృష్టించి మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ అనే వ్యక్తి హైదరాబాద్లోని మూసాపేటలో గల ఓ కంపెనీకి చెందిన స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించాడు. 1500 గజాల స్థలానికి ఫేక్ పత్రాలు సృష్టించి ఆ స్థలానికి అమ్ముతానంటూ.. ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.1.10 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. నకిలీ పత్రాలుగా గుర్తించిన బాధితుడు.. మోస పోయినట్లు గ్రహించి…