ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎస్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని…
టీఎస్‌ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినాటి నుంచి వినూత్న కార్యక్రమాలకు ప్రవేశపెడుతూ ఆర్టీసీ అభివృద్ధికి పాల్పడుతున్నారు. అయితే తాజా మరో కొత్త కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టించి. ఇక నుంచి పెండ్లిలకు బస్సును బుక్ చేసుకుంటే నూతన వధూవరులకు ఆర్టీసీ తరుపున జ్ఞాపికను అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక్క రోజే 500 వివాహాల్లో 500 నవ దంపతులకు ఆర్టీసీ తరుపున షీల్డ్ ను ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానం చేశారు.…
పీఆర్‌సీపై నివేదిక ఇస్తేనే ఇండ్లకు వెళుతామని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెనుదిరిగారు. ఏపీ సెక్రటేరియల్‌లో సుమారు 5 గంటల పాటు నిరీక్షించిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వాపోయారు. రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని, కార్యచరణను రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. 11వ పీఆర్‌సీపై రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీఎస్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సజ్జనార్. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొత్త ఆలోచనలతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ పై దృష్టి పెట్టే విధంగా చేస్తున్నారు. నూతన సంస్కరణలతో ఆర్టీసీ లాభాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో కీలక విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 48,214 మంది ఉద్యోగులతో పాటు 5,034…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది జడ్జీల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఈ.తిరుమల దేవి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై. రేణుక, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్ట్‌గా సీహెచ్‌కే భూపతి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేశ్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా కుంచాల సునీత, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా రామకృష్ణ సునీత,…
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న పీఆర్‌సీపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. పీఆర్‌సీపై కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే ఉద్యోగులు శుభవార్త వింటారని ఆయన వెల్లడించారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే పీఆర్‌సీపైన ప్రకటన చేయాలనుకున్నామని, కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయామన్నారు. త్వరలోనే పీఆర్‌సీపై గుడ్‌న్యూస్ ఉద్యోగులు వింటారని ఆయన అన్నారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఈ నెలలో…
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో జరిగిన ప్రమాదంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందించారు. ఎస్ఆర్పీ-3,3ఎ ఇంక్లైన్ ప్రమాదంలో కార్మికుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా సింగరేణి ఉంటుందని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గని ప్రమాద మృతులకు కంపెనీ…
తెలంగాణలో మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు. అడుగడునా తనిఖీలు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నజీరాబాద్ తండాలో ఓ రైతు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్నాడు. దీనిని గుర్తించిన పోలీసులు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్న రైతును అరెస్టు చేశారు. అంతేకాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్పాట్ వాల్యుయేషన్ కి స్టాఫ్ ని పంపించని కళాశాలల పై చర్యలు తప్పవని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికీ కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమ సిబ్బంది ని పంపించలేదని, పంపించాలని ఆదేశించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రిపోర్ట్ చేయని సిబ్బందికి, ప్రైవేట్ కళాశాలలకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం వరకు సిబ్బందిని రిలీవ్ చేయకున్న, సిబ్బంది రిపోర్ట్ చేయకపోయిన క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.…