మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ యువకుడు ఆంటీ కోసం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇది వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ 20 రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేశారు.
Read Also: ఆర్టీసి కీలక నిర్ణయం: ఉదయం 4 గంటల నుంచే సిటీ సర్వీసులు
ఈ ఘటనలో మహిళ మృతి చెందగా… యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అప్పటి నుంచి యువకుడు తీవ్ర మనస్తాపం చెంది ఆవేదన చెందుతున్నాడు. మహిళ ప్రాణాలతో లేదనే విషయం పదే పదే తలుచుకుని తనలో తానే కుమిలిపోతున్నాడు. దీంతో మంగళవారం నాడు సదరు యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.