యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మోషన్ టీజర్ రిలీజ్ చేసి.. అఫీషియల్ అప్‌డేట్స్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు కొరటాల. అయితే…
ఆ యంగ్ టాలెంట్ ఏం చేసినా.. ఎలాంటి ట్యూన్ ఇచ్చినా.. సెన్సేషనల్‌గా నిలుస్తుంది. పైగా ఆచార్యతో డీలా పడిపోయిన కొరటాల.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో సాలిడ్ హిట్ కొట్టేందుకు కసిగా ఉన్నాడు. అందుకే ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్-కొరటాల శివ.. మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఎన్నో మాస్ బీట్స్‌తో రచ్చ లేపిన అనిరుధ్.. ఈ సారి ఎన్టీఆర్ కోసం అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ మాస్ బీట్ ఎలా ఉండబోతోంది..?…
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.. కాబట్టి ఇక సెట్స్ పైకి వెళ్లటమే ఆలస్యం. ఇక SSMB 28వ ప్రాజెక్టుగా లాంచ్ అయిన ఈ సినిమా టైటిల్.. ఇదేనంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయతే ముందుగా ఈ…
కేజీఎఫ్ సినిమాకు ముందు కన్నడ రాకింగ్ స్టార్‌గా ఉన్న యష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కెజియఫ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా.. కెజియఫ్ చాప్టర్ టు హిందీ బెల్ట్ లో ఏకంగా 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో యష్ గురించే చర్చ జరుగుతోంది. ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న యష్.. కెజియఫ్ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది.…
తెలుగు చిత్రసీమ పాటలతోటలో ఎన్నెన్నో తేనెల వానలు కురిశాయి. అన్నీ తెలుగువారికి పరమానందం పంచాయి. ఈ తోటపై ‘సిరివెన్నెల’ కురిపించిన ఘనత మాత్రం సీతారామశాస్త్రిదే అని అందరూ అంగీకరిస్తారు. సీతారామశాస్త్రి పాటల్లోని పదబంధాలకు తెలుగు జనం ఆరంభంలోనే బందీలయిపోయారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వందల పాటల్లో సిరివెన్నెల కురుస్తూనే ఉంది. నింగిలోని చంద్రుడు కురిపించే వెన్నెల ప్రపంచానికంతా పరిచయమే, నేలపైని చెంబోలు సీతారాముడు కురిపించిన సిరివెన్నెల మాత్రం తెలుగువారికి మాత్రమే సొంతం. ఒకటా రెండా సీతారామశాస్త్రి…
‘హృదయ కాలేయం’తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఇప్పటి వరకూ 12 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. అందులో ఏడవ చిత్రం ‘ధగడ్ సాంబ’. ఇది ఈ నెల 20న జనం ముందుకు వస్తోంది. సోనాక్షి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎన్. ఆర్. రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.బి.హెచ్. శ్రీనుకుమార్ రాజు నిర్మించాడు. తన గత చిత్రాలకు భిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ తో ఇందులో హారర్ టచ్ కూడా ఉందని…
ఫాంటసీ, థ్రిల్లర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమా ‘సురాపానం’. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. సంపత్ కుమార్ దర్శకత్వంలో మట్ట మధు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. హీరో తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా హాస్యాన్ని జోడించి చూపించామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని , జూన్ 10 వ తారీఖున…
ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజును మించిన వారు లేరు. గత కొంతకాలంగా ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రాలోనూ పెద్ద సినిమాలు విడుదలైతే చాలు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, సినిమా టిక్కెట్ రేట్లును నిర్మాతలు పెంచుకుంటున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ లాంటి భారీ బడ్జెట్ మూవీ విషయంలో ఇది సమంజసమే కానీ ఇతర చిత్రాల టిక్కెట్ రేట్లనూ పెంచి అమ్మడం ఎంతవరకూ కరెక్ట్ అనే వాదన ఒకటి వచ్చింది. పాన్ ఇండియా సినిమాల…
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. బాలకృష్ణ ‘అఖండ’కు తమన్ నేపథ్యసంగీతం ఎంతో ప్లస్ అయింది. దాంతో ‘రాధేశ్యామ్’ కి తమన్ ని తీసుకున్నారు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. అందరు హీరోలతో హిట్స్ ఉన్న తమన్ కి ఇది నిరాశ కలిగించే అంశమే. ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి పని చేసే అవకాశం లభించింది. దర్శకుడు మారుతీతో ప్రభాస్ తో తీయబోయే హారర్…
ఛార్మి అందం హిందోళం పాడేది. ఆమె అధరం తాంబూలం సేవించమనేది. ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ వచ్చీ రాగానే జనాన్ని ఆకట్టుకుంది. కేవలం పదిహేనేళ్ళ వయసులోనే కెమెరా ముందు నిలచి, నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఛార్మి. అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి. ఛార్మి కౌర్ 1987 మే 17న పంజాబ్ లోని లూధియానాలో జన్మించింది. ఛార్మికి సినిమాల్లో…