కేజీఎఫ్ సినిమాకు ముందు కన్నడ రాకింగ్ స్టార్‌గా ఉన్న యష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కెజియఫ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా.. కెజియఫ్ చాప్టర్ టు హిందీ బెల్ట్ లో ఏకంగా 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్‌లో యష్ గురించే చర్చ జరుగుతోంది. ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న యష్.. కెజియఫ్ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. యష్ నెక్స్ట్ స్టెప్ ఏంటీ.. ఏ సినిమా చేయబోతున్నాడు.. ఎవరితో చేయబోతున్నాడు.. డైరెక్టర్ ఎవరు.. ఏ ప్రొడక్షన్ హౌజ్‌లో చేయబోతున్నాడు.. అనే విషయాలు ఏది కూడా రివీల్ కాలేదు. ఈ నేపథ్యంలో.. మళ్లీ `కేజీఎఫ్ 3`తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని విపిపించింది. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. తెలుగులోనే యష్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. యష్‌తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నారు దిల్ రాజు. స్టార్ డైరెక్టర్ శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్లో..అత్యంత ప్రతిష్టాత్మంకగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు యష్‌తో కూడా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు.. ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నారనేది.. ఇంకా తెలియరాలేదు. ఇక ఈ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్.. కేజీయఫ్ 2.. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. అంటే ఈ జూన్ 3న రాబోతున్నట్టు వినిపిస్తోంది. దాంతో ఈ అనౌన్స్మెంట్ కోసం ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు నెటిజన్స్. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో అనేది తెలియాలంటే.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.