ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.. కాబట్టి ఇక సెట్స్ పైకి వెళ్లటమే ఆలస్యం. ఇక SSMB 28వ ప్రాజెక్టుగా లాంచ్ అయిన ఈ సినిమా టైటిల్.. ఇదేనంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయతే ముందుగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు.. అతడుకు సీక్వెల్‌గా రాబోతోందని.. అందుకే పార్థు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ రీసెంట్‌గా త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్‌లో భాగంగా ‘అర్జునుడు’ అనే టైటిల్.. దాదాపుగా ఫిక్స్ అయిపోయిందని.. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న అనౌన్స్ చేస్తారంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్ తెరపైకి వచ్చింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన టైటిల్.. మహేష్ కోసం ఫైనల్ చేయబోతున్నారని వినిపిస్తోంది.
భీమ్లా నాయక్ కోసం ముందుగా.. త్రివిక్రమ్ స్టైల్లో ‘అ’ అక్షరం సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ‘అసుర సంధ్య వేళలో.. అనే టైటిల్ అనుకున్నారట. కానీ పవన్ కోసం మాసివ్‌గా ఉండేలా.. భీమ్లా నాయక్ ఫిక్స్ చేసినట్టు టాక్. దాంతో ఈ టైటిల్ త్రివిక్రమ్ దగ్గర అలాగే ఉండిపోయింది. అందుకే మహేష్ కోసం అదే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో ఉన్నాడట మాటల మాంత్రికుడు. తన లాస్ట్ ఫిల్మ్ కూడా ఇదే స్టైల్లో.. అల వైకుంఠపురంలో.. టైటిల్‌తో వచ్చింది. అంతకు ముందు ఎన్టీఆర్‌తో కూడా అరవింద సమేత చేశారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దాంతో ఇప్పుడు మహేష్ కోసం ‘అసుర సంధ్య వేళలో.. టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అయితే ఇలాంటి విషయాల్లో ఇప్పటి వరకు ఎలాంటి అపిషీయల్ అప్టేట్ రాలేదు. దాంతో అసలు మహేష్ కోసం ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు.. ఇప్పుడు వినిపిస్తున్న వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.