బాహుబలికి ముందు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో పాన్ వరల్డ్ స్టార్‌గా మారడం పక్కా అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు రాబోతోంది.. డైరెక్టర్ ఎవరు.. ఆ వార్తల్లో ఎంతవరకు నిజముంది..? ప్రస్తుతం…
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే ప్రియమణి అభినయంతో పాటు అందాల ఆరబోతతోనూ అలరించింది. అందువల్లే ప్రియమణి అభిమానగణాలకూ కొదువలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ ప్రియమణి నర్తించిన తీరు ప్రేక్షకులకు పరమానందం పంచింది. తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన ఈ కన్నడ కస్తూరి తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు,…
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా మణిరత్నం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోతున్నాయి. పైగా ఆయన నుండి వస్తున్న చిత్రాలలోనూ పాతకథలే కనిపించాయి. దాంతో ఈ తరం జనం మణి సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని…
సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ…
గడిచిన నాలుగు నెలలతో పోల్చితే మే లో తక్కువ సినిమాలు విడుదలయ్యాయి. స్ట్రయిట్, డబ్బింగ్, ఓటీటీ సినిమాలతో కలిపి కేవలం 17 చిత్రాలే జనం ముందుకు వచ్చాయి. విశేషం ఏమంటే పలు చిన్న సినిమాల నడుమ ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్ 3′ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక వీక్ వైజ్ గా చూసుకుంటే మే 6వ తేదీ ఏకంగా ఏడు సినిమాలు ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో సందడి చేశాయి. చాలా…
ఈ రోజు ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రసీమ టాలీవుడ్. అయితే అందుకు అనుగుణంగా మన హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెళుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఒకప్పుడు చిత్రసీమలో కమిట్ మెంట్ కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడది కాగడా పెట్టి వెతికినా కానరాదు. ఎవరికి వారు సక్సెస్ వెంట పరుగులు పెడుతూ అది ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. సక్సెస్ లో ఉన్న వారిని కలుపుతూ క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేసుకుని లాభ…
ప్రస్తుతం సమంత చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఒకటి, అరా సినిమాలకు, వెబ్ సిరీస్‌కు సైన్ చేసింది. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. అయితే ఇవన్నీ కూడా ముంబైలో ఉంటూ ఆపరేట్ చేస్తోంది సమంత. ఈ నేపథ్యంలో సామ్ ముంబైకి మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ కాలనీలో సమంత ఓ ఖరీదైన ప్లాట్ తీసుకుందని వార్తలొచ్చాయి.…
వేట మొదలు అంటూ నందమూరి బాలకృష్ణ మరోసారి ప్రేక్షకులను రంజింపచేయడానికి వచ్చేస్తున్నారు. నట సార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని బాలకృష్ణ 107 సినిమా నుంచి పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ పోస్టర్లో… చుట్టూ జనమంతా చూస్తుండగా శత్రు సంహారం చేస్తున్న వీరుడిలా ఈ పోస్టర్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. మంచి ఫిట్ నెస్ తో ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తమన్…
ఉలగనాయకుడు కమల్ హాసన్ గత కొంత కాలంగా వరుసగా అపజయాలను ఫేస్ చేస్తున్నాడు. 2008లో ‘దశావతారం’, 2013లో ‘విశ్వరూపం’ తప్ప ఇటీవల కాలం వచ్చిన కమల్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజాయాలను అందుకున్నాయి. 2017 నుంచి తమిళ బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు కమల్. ఇటీవల కాలంలో రాజకీయాల బాట పట్టిన కమల్ మక్కల్ నీతిమయం పేరుతో పార్టీ స్థాపించి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశాడు. అయితే పోటీ చేసిన…