తెలుగు చిత్రసీమలో పూర్ణోదయ సంస్థకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. నాటి ‘తాయారమ్మ బంగారయ్య’ నుంచి ‘ఆపద్భాందవుడు’ వరకూ పలు క్లాసికల్ చిత్రాలను నిర్మించిన ఘనత ఈ సంస్థది. ‘శంకరాభరణం, సితార, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి’ వంటి సినిమాలు ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ సంస్థ 30 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో మనవరాలు శ్రీజ ఏడిద నిర్మాతగా ‘జాతి రత్నాలు’…
ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఈ సినిమా గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోందని, బిత్తిరి సత్తి, అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలను గోవా షెడ్యూల్ లో చిత్రీకరించామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.…
‘పూజా మన కాజా…. ఆమె లెగ్ పెడితే సూపర్ హిట్’ అంటూ ‘బీస్ట్’ను తెలుగులో విడుదల చేసిన ‘దిల్’ రాజు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె నటించిన ‘డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని ఉదాహరణగా పేర్కొన్నారు. పూజా హెగ్డే ఇప్పుడు ఆల్ ఇండియా హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్, సినిమా సినిమాకూ ఆమె నటిగానూ ఎంతో పరిణతి చూపుతోందని కితాబిచ్చారు. అయితే…
మ్యూజిక్ లో తమన్ బ్లాక్ బస్టర్! సింగింగ్ లో కార్తిక్ బ్లాక్ బస్టర్!! యాక్టింగ్ లో నిత్యామీనన్ బ్లాక్ బస్టర్!!! సో… ఈ ముగ్గురి మూవీస్ కు సంబంధించిన పాటలతో ఈ వీకెండ్ తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ సాగింది. గతంలో కంటే మరింత ఫన్ గా, కాస్తంత డిఫరెంట్ గా ఈ ఎపిసోడ్ ను మొదలు పెట్టారు. పార్టిసిపెంట్ జయంత్… శ్రీరామచంద్ర స్థానంలోకి హోస్ట్ గా వచ్చే సరికీ జడ్జీలు కాస్తంత కంగారు పడ్డారు. అయితే……
వరుణ్ తేజ్ ‘గని’ మూవీ శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ కు, ‘గని’ చిత్ర బృందానికి విషెస్ చెప్పింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. మామూలుగా అయితే… ఇందులో పెద్దంత ప్రత్యేక ఏమీ లేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనే పుకారు షికారు చేస్తోంది. ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అయోధ్య భామ… వరుణ్ తేజ్ సరసన తొలిసారి ‘మిస్టర్’…
‘బాహుబలి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీని పొందిన ప్రభాకర్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు. తాజాగా అతను ప్రధాన పాత్రధారిగా ఆర్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై గురువారం ఫిల్మ్ నగర్ లోని దైవసన్నిధానంలో ఓ సినిమా ప్రారంభమైంది. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు, నటుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ ఇవ్వగా, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్చాన్…
ఈ మధ్య ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమాతో సందడి చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ చేయబోతున్నాడు. ఈ తాజా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలయింది. మంగళవాయిద్యాలతో శుభకరంగా ఈ పిక్ మొదలవుతుంది. ‘వీరా వెడ్స్ కీర్తి’ అనీ కనిపిస్తుంది. ఓ వైపు పెళ్ళితంతు, మరోవైపు కుస్తీ పోరుకు సంబంధించిన ఇమేజెస్. చివరలో ‘మట్టి కుస్తీ’ టైటిల్ దర్శనమిస్తుంది. ‘ఎఫ్.ఐ.ఆర్.’ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమాకు కూడా రవితేజ సమర్పకుడు…
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ‘కలియుగ్’ తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్ ఖేము. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ తోనూ నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కునాల్. తాజాగా అతను నటించిన ‘అభయ్’ వెబ్ సీరిస్ సీజన్ త్రీ జీ 5లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే… హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ దీన్ని డబ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో కునాల్ ఖేముతో…
Famous Actor Anupam Kher In Sankalp Reddy Movie. ప్రస్తుతం భారతీయ చిత్రసీమ మాత్రమే కాదు… అన్ని పొలిటికల్ పార్టీలూ మాట్లాడుకుంటున్న సినిమా ఒక్కటే… ‘ద కశ్మీర్ ఫైల్స్’. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను చూసి వినోదపు పన్ను రాయితీ ఇస్తే, ఆ పార్టీని వ్యతిరేకించే తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు ‘ద కశ్మీర్ ఫైల్స్’ సమాజంలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే చిత్రమని అభివర్ణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు…
చిన్నచిత్రంగా వచ్చి భారీ విజయాలను చవిచూసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను చూసిన చిత్రాలు అంతగా కనిపించలేదు. కారణం కరోనా కావచ్చు, మరేదైనా అవ్వవచ్చు. గత సంవత్సరం డిసెంబర నెల నుండే సినిమాలు మళ్ళీ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇప్పుడు ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రాకతో ఆ వెలుగులు మరింతగా పెరిగాయి. చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రోజు రోజుకూ…