‘హృదయ కాలేయం’తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఇప్పటి వరకూ 12 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. అందులో ఏడవ చిత్రం ‘ధగడ్ సాంబ’. ఇది ఈ నెల 20న జనం ముందుకు వస్తోంది. సోనాక్షి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎన్. ఆర్. రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.బి.హెచ్. శ్రీనుకుమార్ రాజు నిర్మించాడు. తన గత చిత్రాలకు భిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ తో ఇందులో హారర్ టచ్ కూడా ఉందని సంపూ తెలిపాడు. తాను హీరోగా నటించిన మరో మూడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయని, ‘బ్రిలియంట్ బాబు సన్నాఫ్ తెనాలి’, ‘దానవీరశూర కర్ణ’, ‘మిస్టర్ బెగ్గర్’ చిత్రాల షూటింగ్ జరుగుతోందని చెప్పాడు. అలానే తాను హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం 70 శాతం పూర్తయ్యిందని తెలిపాడు. మరి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అంగీకరించాల్సి ఉందని, వాటి వివరాలు త్వరలో తెలియచేస్తానని అన్నాడు.
‘కొబ్బరి మట్ట, సింగం 123, పెదరాయుడు’ వంటి సినిమాల్లో ఎక్కువగా స్కూప్స్ వున్నాయని, ‘ధగడ్ సాంబ’లో అలాంటి వేవీ లేవని, డైలాగ్స్ కూడా భిన్నంగా ఉండి ఆకట్టుకుంటాయని సంపూ చెప్పాడు. ఇందులోని నాలుగు యాక్షన్ సీన్స్ నలుగురు ఫైట్ మాస్టర్స్ డిఫరెంట్ గా కంపోజ్ చేశారని తెలిపాడు. ఈ సినిమాను తెలుగువారందరూ ఆదరించి తనను ఆశీర్వదిస్తారనే ఆశాభావాన్ని సంపూ వ్యక్తం చేశాడు.