NTR 30: కొరటాలకు ఎన్టీఆర్ ఫైనల్ టచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మోషన్ టీజర్ రిలీజ్ చేసి.. అఫీషియల్ అప్‌డేట్స్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు కొరటాల. అయితే ఇటీవలె మెగాస్టార్ ఆచార్య ఫ్లాప్‌తో డీలా పడిపోయిన కొరటాలకు.. మరోసారి స్క్రిప్టు పై కూర్చోవాలని చెప్పాడట ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఉన్నాడు.
Also Read
అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఎన్టీఆర్ 30 కథాచర్చల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నాడట. ఎన్టీఆర్‌కు స్క్రిప్టు పై కూడా మంచి అవగాహన ఉండడంతో.. కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్టు టాక్. మొత్తంగా ఈ ఇద్దరు కలిసి.. స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చేందుకు భారీగానే కసరత్తులు చేస్తున్నారట. వీలైనంత త్వరలో స్క్రిప్టు లాక్ చేసి.. షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి.. ఆలియా భట్, దిశా పటానీ, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి. ఇక సౌత్ నుంచి రష్మిక, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. దాంతో వీరిలో యంగ్ టైగర్ ఎవరితో రొమాన్స్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే వన్స్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే.. హీరోయినే కాదు, మిగతా నటీనటుల వివరాలు కూడా తెలియనున్నాయి. ఏదేమైనా జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్.. ఈ సారి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!