అప్పుడో… ఇప్పుడో… ‘రామారావ్ ఆన్ డ్యూటీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ సినిమాల విడుదల తేదీలను రీ షఫిల్ చేసుకుంటున్నారు. అగ్ర కథానాయకుల చిత్రాల విడుదల తేదీలన్నీ మారిపోయాయి. ఇక ‘గని’ లాంటి సినిమా అయితే రెండు లేదా మూడు వారాల ముందు రావాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మాస్ మహరాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా విడుదల విషయంలోనూ నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముందు అనుకున్నట్టు మార్చి 25వ తేదీ లేదంటే ఏప్రిల్ 15న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ‘ఈ రోజుల్లో’ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు శరత్ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!