ఉత్తర గాజాలో జరిగిన పేలుడులో అత్యంత సీనియర్ ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్లలో ఒకరైన కల్నల్ అహ్సన్ దక్సా మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. జబాలియా ప్రాంతంలో అహ్సన్ దక్సాను పేలుడు పదార్ధం తాకడంతో ఈ సంఘటన జరిగిందని సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా సిరియాపై విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసగా గగనతల దాడులకు తెగబడింది. శుక్రవారం నుంచి పలుమార్లు దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. ఏకధాటిగా ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ రాకెట్లు బీరుట్‌ను తాకినప్పుడు యూఎన్ కార్యాలయం సమీపంలో పడ్డాయి.
ఇజ్రాయెల్‌కు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ ప్రతిదాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన 8 మంది సైనికులు మృతిచెందినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధం చేస్తున్నా.. ఇప్పటి వరకు సైన్యానికి ఎలాంటి హానీ జరగలేదు.
గతేడాది అక్టోబర్ నుంచి హమాస్‌తో మొదలైన ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పటిదాకా ఏకధాటిగా కొనసాగించింది. గాజాను నేలమట్టం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌లో దాడులు చేస్తోంది. ఇన్ని రోజులు పోరాటంలో ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా యుద్దం చేస్తోంది.
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.