ఇజ్రాయెల్‌కు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ ప్రతిదాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన 8 మంది సైనికులు మృతిచెందినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధం చేస్తున్నా.. ఇప్పటి వరకు సైన్యానికి ఎలాంటి హానీ జరగలేదు. కానీ బుధవారం మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్, కెప్టెన్ హరెల్ ఎటింగర్, కెప్టెన్ ఇటాయ్ ఏరియల్ గియాట్, సార్జెంట్ ఫస్ట్ క్లాస్ నోమ్ బార్జిలే, సార్జెంట్ ఫస్ట్ క్లాస్ ఆర్ మంత్జుర్, సార్జెంట్ ఫస్ట్ క్లాస్ నజార్ ఇట్కిన్, స్టాఫ్ సార్జెంట్ ఆల్మ్‌కెన్ టెరెఫ్ మరియు స్టాఫ్ సార్జెంట్ ఇడో బ్రోయర్ చనిపోయారు.
ఇది కూడా చదవండి: Japan: ఎయిర్‌పోర్టులో పేలిన యూఎస్ బాంబు.. 87 విమానాలు రద్దు
ఇజ్రాయెల్ బుధవారం లెబనాన్ సరిహద్దులు దాటింది. ఆ సమయంలో లెబనాన్ దళాలు ఎదురుదాడికి దిగాయి. దీంతో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. 8 మంది సైనికులను కోల్పోయింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆర్మీ కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్ చనిపోయాడు. భూతల దాడిలో భాగంగా తొలి మరణాన్ని చవిచూసింది. మరో ఏడుగురు సైనికులు కూడా పడిపోయినట్లు ఐడీఎఫ్ తాజాగా ప్రకటించింది. దక్షిణ సరిహద్దు గ్రామంలోకి చొరబడిన ఇజ్రాయెల్ దళాలతో హిజ్బుల్లా యోధులు ఎదురుదాడులకు దిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య సరిహద్దు గ్రామమైన అడేస్సేలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తర్వాత ఇజ్రాయెల్ సైనికులు వెనక్కి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Israel: ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం
ఇజ్రాయెల్ సైన్యం.. దక్షిణ లెబనాన్‌లోని అదనపు ప్రాంతాలను ఖాళీ చేయమని బుధవారం పిలుపునిచ్చింది. దక్షిణ లెబనాన్‌లోని 20 గ్రామాలు మరియు పట్టణాలను విడిచిపెట్టమని నివాసితులకు ఆదేశించింది. భూతల దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైంది. లెబనాన్ భూభాగంలోకి సుమారు 400 మీటర్ల బ్లూలైన్‌లోకి ఇజ్రాయల్ దళాలు వచ్చాయి. కొద్దిసేపటికే ఉపసంహరించుకున్నాయి.
హిజ్బుల్లా అధినేత నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక మంగళవారం ఇరాన్ దూకుడు ప్రదర్శించింది. ఇజ్రాయెల్‌పై ఒకేసారి 180 క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ గగనతలంలోనే తిప్పికొట్టింది. అయితే కొన్ని టెల్అవీవ్, జెరూషలేంలో పడ్డాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: Bottle gourd Benefits: సొరకాయ జ్యూస్‌తో ఎన్ని లాభాలో..!