Russia: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా సంచలన ప్రకటన
- హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా కీలక ప్రకటన
- రాజకీయ హత్యగా అభివర్ణించిన రష్యా
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. పేజర్లు, వాకీటాకీలు పేల్చడంతో మొదలు పెట్టిన ఇజ్రాయెల్.. చివరికి హిజ్బుల్లా అగ్ర నేతలను అంతమొందించింది. అతి ముఖ్యమైన కమాండర్లను లేపేసింది. ఇక హిజ్బుల్లాలో అత్యంత శక్తివంతమైన నేత, దాని అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ తుదిముట్టించడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. అత్యంత రహస్య ప్రాంతాల్లో దాగి ఉన్న నస్రల్లాను తుదిముట్టించడం హిజ్బుల్లా మద్దతుదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్..!
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ఇక ఇదే అంశంపై రష్యా కీలక ప్రకటన చేసింది. నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా అభివర్ణించింది. తక్షణమే లెబనాన్‌పై దాడులు ఆపాలని సూచించింది. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ ప్రధాని మిఖాయల్ మిషుస్తిన్ పర్యటిస్తున్నారని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడితో కూడా భేటీ కానున్నారని వెల్లడించింది. ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో కూడా రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ ఇరాన్ సాయం ఎప్పటికీ మరిచిపోనిది అని తెలిపింది. ఇరాన్‌తో మైత్రి పెంపొందించుకుంటామని.. అలాగే వ్యాపార సంబంధాలు కూడా బలపరుచుకుంటామని రష్యా స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Houthis- Israel: హౌతీలే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు..
నస్రల్లా మరణం తర్వాత కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌లో భీకర దాడులు చేస్తోంది. పెద్ద పెద్ద భవంతులను కూల్చివేస్తోంది. నివాస సముదాయాల్లోనే హిజ్బుల్లా ఆయుధాలను దాచి పెట్టినట్లుగా ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బీరుట్ నగరంలోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే లెబనాన్ పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని సూచించింది. తమ లక్ష్యం పూర్తయ్యాక తిరిగి పౌరులు రావొచ్చని వెల్లడించింది. ఇక ఇరాన్ కాలుదువ్వితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!