US-Syria: సిరియాపై అమెరికా బాంబుల వర్షం.. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా భీకరదాడి
- సిరియాపై అమెరికా బాంబుల వర్షం
- ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా భీకరదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా సిరియాపై విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసగా గగనతల దాడులకు తెగబడింది. శుక్రవారం నుంచి పలుమార్లు దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలపై ఐసిస్ దాడులు చేసేందుకు కుట్ర పన్నిందన్న కచ్చితమైన సమాచారంతో అమెరికా ముందస్తు దాడులకు దిగింది.
ఇది కూడా చదవండి: Coriander benefits: కొత్తిమీరతో బీపీ, డయాబెటిస్ కంట్రోల్!
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
సిరియాలోని సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అమెరికా తెలిపింది. ఇటీవల కాలంలో కూడా పలుమార్లు అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించింది. వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని తెలిపింది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. తాజా దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే, మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేవారిని సహించబోమని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Liquor : విస్కీ, బీరు కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇప్పటికే హమాస్-హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజా, లెబనాన్‌ను ధ్వంసం చేసింది. ఇరాన్‌పై కూడా దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై అమెరికా తన ఆంక్షలను విస్తరించింది. ఇటీవల ఇజ్రాయెల్‌పై బాలస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంకోవైపు అమెరికా మిత్రదేశాలకు కూడా ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ram Charna: అలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!