HMDA Land Auction: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి భూముల వేలానికి హెచ్‌ఎండీఏ (HMDA) రంగం సిద్ధం చేసింది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేటలోని నియో పోలీస్, కూకట్‌పల్లి పరిధిలో ఉన్న మూసాపేట వై జంక్షన్ వద్ద భూముల అమ్మకానికి HMDA ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 47 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. Chevella Tragedy: చేవెళ్ల దారుణం.. స్పందించిన సీఎం రేవంత్, కేసీఆర్..! కోకాపేట నియో పోలీస్‌లో 32…
ఆభరణాల ప్రపంచంలో కొత్త మెరుపు చేరబోతోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రజలకు నూతన ఆభరణాల అనుభవాన్ని అందించేందుకు పూర్వి జువెలర్స్ (ముకుంద జువెలర్స్) కొత్త షోరూమ్‌ను ప్రారంభించనుంది. నవంబర్ 1, 2025న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు స్థానికులు హాజరుకానున్నారు. కేపీహెచ్‌బీ ఫేజ్–1, రోడ్ నం. 4లో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూమ్ ఆధునిక డిజైన్లతో పాటు సాంప్రదాయ శైలిని కలగలిపిన ఆభరణాలను అందించనుంది. పూర్వి జువెలర్స్…
Kukatpally: హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బి కాలనీ రోడ్డు నంబర్ 5 వద్ద అమానుష సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హాస్టల్‌లో కొందరు యువకులు స్థానిక కుటుంబంపై దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్ నంబర్ 5లో నివసిస్తున్న ఒక కుటుంబం తమ ఇంటి ముందు హాస్టల్ యువకులు బైకులు పార్క్ చేస్తున్నారని పలుమార్లు వారిని హెచ్చరించినట్టు, హాస్టల్ మేనేజ్మెంట్‌కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నిర్వాహకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు…
రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. మరొకరితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు కొందరు భార్యలు, భర్తలు. మహిళలు మాత్రం వాళ్ల ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తి.. అతని స్నేహితుడితో కలసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి సుమిత్రానగర్‌లో నివాసం ఉంటున్న..భూపాల్ అనే వ్యక్తిపై.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న…
హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ మర్డర్‌ను పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిందితులను అరెస్ట్ చేశారు. వారిద్దరి అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్లో ఈ నెల10న రేణు అగర్వాల్ అనే మహిళను దారుణంగా చంపేశారు. ఇంట్లో వంట పని చేసే హర్ష, రోషన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్య తర్వాత…
ఆర్ధిక ఇబ్బందులు.. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అప్పుల ఊభిలో చిక్కుకుపోయి.. గతంలో కొన్ని కుటుంబాలు సైతం మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులకు మరో కుటుంబం విచ్ఛిన్నమైంది. భార్య, భర్త బలవన్మరణానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ జరిగింది. భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రి పాలైంది. అసలు కూకట్‌పల్లి కేసులో ఏం జరిగింది? ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రామకృష్ణ. ఆయనకు 20 ఏళ్ల…
తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా చైన్ స్నాచర్ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు వేసుకొని బైక్‌పై వచ్చి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారంను ఎత్తుకెలుతున్నారు. మహిళల మెడల్లో నుంచి పుస్తెలు తాడు లేదా చైన్స్ లాక్కెళ్లిన ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్తరకం చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. Also Read: IND vs ENG: రసవత్తర ముగింపు దిశగా ఐదో టెస్ట్.. భారత్‌కు 4 వికెట్లు,…
ప్రజా సమస్యల పోరాటంలో జైలుకు వెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. పొద్దున లేస్తే మొదలు కేటీఆర్, కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా.. ఇబ్బందికి గురి చేసేలా ఫోన్ టాపింగ్, ఫార్ములా రేస్,…
HYDRA : హైదరాబాద్‌లో వర్షాకాలంలో వరదలు ముంచెత్తకుండా నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్ పరిసరాల్లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఆపరేషన్‌లో హైడ్రా అధికారులు తొలుత బుల్కాపూర్ నాలా, ఐడీఎల్ నాలాల ఆక్రమణలను తొలగించే పనులను చేపట్టారు. బుల్కాపూర్ చెరువు నుంచి ప్రారంభమై, హైటెక్ సిటీ ప్రాంతాల గుండా హుస్సేన్ సాగర్‌లో కలిసే ఈ నాలా, గత కొన్నేళ్లుగా అనేక చోట్ల ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా తుమ్మలబస్తీ.. ఆనందనగర్ మధ్య…
HYDRA: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్లోని హబీబ్ నగర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు ఆక్రమణలపై దాడి చేశారు. నాలా పైన నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ చర్యల్లో భాగంగా.. హబీబ్ నగర్ ప్రాంతంలో ఎన్ఆర్సి గార్డెన్ ప్రహరీ గోడతో పాటు మరో ప్రహరీ గోడను కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు. స్థానికంగా 7 మీటర్ల విస్తీర్ణంలో నాలా ఉందని గుర్తించిన అధికారులు, వాటిపై జరిగిన ఆక్రమణలను తొలగించేందుకు…