హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ మర్డర్‌ను పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిందితులను అరెస్ట్ చేశారు. వారిద్దరి అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్లో ఈ నెల10న రేణు అగర్వాల్ అనే మహిళను దారుణంగా చంపేశారు. ఇంట్లో వంట పని చేసే హర్ష, రోషన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్య తర్వాత పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 10 టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 3 రోజుల తర్వాత కేసును ఛేదించారు.
రేణు అగర్వాల్ హత్య కేసులో ఉన్న నిందితులు హర్ష, రోషన్.. ఎంతో నమ్మకస్తుల్లా నటించారు. వారి ఇంట్లో దోపిడీ చేయాలని 2 రోజుల క్రితమే స్కెచ్చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న రేణు అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్, కొడుకు శుభం.. యధావిధిగా షాప్‌కు వెళ్లిన సమయంలో దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ కాళ్లు, చేతులు కట్టేశారు. ఆమె కేకలు వేయకుండా గొంతులో కత్తెరతో పొడిచారు. ఆ తర్వాత బంగారం, డబ్బు కోసం ఆమె తలపై కొట్టారు. నానా చిత్ర హింసలు పెట్టారు. చివరకు ఆమెను అతి దారుణంగా హత్య చేసి బంగారంతో ఉడాయించారు.
నిందితుల కోసం పోలీసులు 3 రోజులుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసును ఛేదించారు. హత్య తర్వాత స్కూటీపై వెళ్లిన హర్ష, రోషన్.. దాన్ని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి.. క్యాబ్‌లో రాంచీకి పారిపోయారు. అదే క్యాబ్ డ్రైవర్.. తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరినీ గుర్తు పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తిరిగి రాంచీకి వెళ్లిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు, 10 వాచ్‌లు, మరికొన్ని రోల్డ్ గోల్డ్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
వాయిస్: వారిద్దరి అరెస్ట్ తర్వాత వారి గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్యకు ముందు మెదక్ జిల్లా తుఫ్రాన్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో హర్ష అండ్ గ్యాంగ్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. అంతే కాదు ఇద్దరికీ గంజాయి తాగే అలవాటు ఉంది. హర్ష.. గతంలో కోల్‌కతాలోని రీహబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందాడు. ఇక రోషన్‌పై రాంచీలో ఇప్పటికే 3 కేసులు ఉన్నాయి. ఈ కేసులో రోషన్ సోదరుడు కూడా వారికి సహకరించాడని అతన్ని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఎవరిని పడితే వారిని.. ఎంక్వైరీ చేయకుండా పనిలో పెట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.