గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. అయితే ఈ బదిలీల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత మరోసారి తన స్థానాన్ని వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కూకట్‌పల్లిని వీడేందుకు మమత విముఖత చూపారు. దీంతో ఆమెను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గానే కొనసాగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: రెండు రోజుల పాటు నీటి సరఫరా…
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారి దోపిడీ కలకలం సృష్టించింది. జలాలుద్దీన్ అనే బిస్కెట్లు వ్యాపారికి కత్తి చూపించి బెదిరించిన దుండకులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు అగంతకులు వ్యాపారిపై దాడి చేసి జేబులో నుంచి డబ్బులు లాక్కున్నారు. గంజాయి సేవించే గ్యాంగు తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఆధారంగా అగంతకులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి ముందు ఒక్క కుక్క రోడ్డు దాటింది. జీబ్రా క్రాసింగ్ మీదుగానే ఆ కుక్క రోడ్డు దాటి వెళ్లిపోయింది. కానీ ఆ యువకుడు మాత్రం రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. మద్యం తాగి…