సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. కూకట్‌పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్‌లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు శుక్రవారం దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఇవాళ భూపాలపల్లిలో జరిగిందే.. కూకట్ పల్లిలో కూడా జరగడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. తాళం వేసిన ఇంటిలో దొంగలు చొరబడి దొరికినకాటికి దోచుకుని పరార్ అయ్యారు. ఇవాళ ఉదయం వచ్చిన యజమాని ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Read also: Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం…
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం విచ్చేసిన కార్మికుడి కుమారుడు జంతర్ (5)పై లైంగిక దాడికి యత్నించాడు. పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా బాలుడికి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు.
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారని ఆయన ఆరోపించారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి…నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని,…
కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు విషయాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా మెట్రో స్టేషన్ల కింద మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో యూనిట్, హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీమ్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో నాలుగు టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీలలో 31 మంది మహిళలు, యువతులు దొరికారన్నారు. వీరంతా అక్కడి నుండి…
IT Raids: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూకట్‌పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
Hydra: హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది.
Money On Roads: ప్రస్తుత సమాజంలో మనిషి బయట ప్రజలతో మాట్లాడడం కంటే సోషల్ మీడియాలో గడపడం ఎక్కువగా జరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పుడు నుంచి అనేక సోషల్ మీడియా యాప్స్ వల్ల చాలామంది ఫోన్ కు అంకితం అయిపోతున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని చాలామంది యువత పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది వారి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న వారు ఉన్నారు. మరికొందరు…
తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 27న హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.