ఆర్ధిక ఇబ్బందులు.. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అప్పుల ఊభిలో చిక్కుకుపోయి.. గతంలో కొన్ని కుటుంబాలు సైతం మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులకు మరో కుటుంబం విచ్ఛిన్నమైంది. భార్య, భర్త బలవన్మరణానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ జరిగింది. భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రి పాలైంది. అసలు కూకట్‌పల్లి కేసులో ఏం జరిగింది?
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రామకృష్ణ. ఆయనకు 20 ఏళ్ల కిందట రమ్యకృష్ణతో వివాహమైంది. పైళ్లైన తర్వాత వారి కాపురం సాఫీగానే సాగింది. కానీ పెళ్లై 20 ఏళ్లు అయినా వారికి పిల్లలు కలగలేదు. అయినప్పటికీ ఇద్దరూ హాయిగానే కాపురం చేస్తున్నారు. కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీలోని 6వ ఫేస్‌లోని ఓ అపార్టుమెంట్లో అద్దెకు ఉంటున్నారు. రామకృష్ణ ఇటీవల వ్యాపారం చేసి.. దానిలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు పెరిగిపోవడంతో వ్యాపార నిర్వహణ కూడా కష్టంగా మారింది. మరోవైపు అప్పుల్లో కూరుకుపోవడం వల్ల బంధువులు కూడా చులకనగా చూడడం ప్రారంభించారు. ఓ వైపు అప్పులు మరోవైపు బంధువుల సూటిపోటి మాటలకు మనస్తాపం చెందారు.
ఆర్ధిక ఇబ్బందుల కారణంతో ఇద్దరూ బలవన్మరణం చెందాలని డిసైడ్ అయ్యారు. వినాయక చవితి రోజునే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఐతే ఎలా చనిపోవాలి అనే దానిపై ఇద్దరూ కలిసి చర్చించుకున్నారు. చివరికి గొంతు కోసుకుని చనిపోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో తన గొంతు కోసి ఆ తర్వాత నువ్వు కూడా గొంతు కోసుకుని చనిపోవాలని భార్యకు సూచించాడు రామకృష్ణ. దీంతో భర్త రామకృష్ణ గొంతు కోసేసింది రమ్యకృష్ణ. కానీ మరునాడు ఉదయానికి కూడా ఆయన చనిపోలేదు. దీంతో మరోసారి కత్తితో కడుపు మీద గాయం చేసింది. తీవ్రంగా రక్తస్రావమై రామకృష్ణ చనిపోయాడు.
ఆ తర్వాత రమ్యకృష్ణ గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. కానీ ఆమెకు ధైర్యం సరిపోలేదు. ఫలితంగా ఆమెకు తీవ్రంగా గాయమైనప్పటికీ ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 100కు డయల్ చేసి.. విషయం చెప్పింది రమ్యకృష్ణ. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త రామకృష్ణ డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. కత్తితో గొంతుకోసుకున్న రమ్యకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక రమ్యకృష్ణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు.