ఆభరణాల ప్రపంచంలో కొత్త మెరుపు చేరబోతోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రజలకు నూతన ఆభరణాల అనుభవాన్ని అందించేందుకు పూర్వి జువెలర్స్ (ముకుంద జువెలర్స్) కొత్త షోరూమ్‌ను ప్రారంభించనుంది. నవంబర్ 1, 2025న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు స్థానికులు హాజరుకానున్నారు.
కేపీహెచ్‌బీ ఫేజ్–1, రోడ్ నం. 4లో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూమ్ ఆధునిక డిజైన్లతో పాటు సాంప్రదాయ శైలిని కలగలిపిన ఆభరణాలను అందించనుంది. పూర్వి జువెలర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, “మా కస్టమర్లకు కొత్త తరహా డిజైన్లతో పాటు విశ్వసనీయతను అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
బాలాజీనగర్ డివిజన్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ పగుడల శిరీష గారు గెస్ట్ ఆఫ్ హానర్‌గా పాల్గొననున్నారు. ఆభరణాల రూపకల్పనలో కొత్త ట్రెండ్‌లను తెస్తూ పూర్వి జువెలర్స్ కస్టమర్లకు విలువైన అనుభవాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. నాణ్యత, నూతనత, విశ్వాసం అనే మూడు సూత్రాలతో పూర్వి జువెలర్స్ కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటోంది.
వేదిక: H.No: 15-24-297-/MIG-1, ఫేజ్-1, రోడ్ నం: 4, కెఫ్ఫీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి – 500072
సంప్రదించడానికి: 91213 22337